Viral: పైలట్ అవాల్సిన వ్యక్తి.. పరిస్థితి బాగాలేక కూరగాయల వ్యాపారం.. ఒకే ఒక్క ఐడియాతో ఏడాదికి రూ.50 లక్షలు..!
ABN, First Publish Date - 2023-07-17T15:43:12+05:30
మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలు భద్రమైన ఉద్యోగం చేసుకోవాలని, ప్రభుత్వోద్యోగం సంపాదించి హాయిగా జీవించాలని కోరుకుంటారు. డాక్టరో, ఇంజనీరో, బ్యాంకు ఉద్యోగో కావాలనుకుంటారు. భోపాల్‌కు చెందిన అంకిత్ సాహు తల్లిదండ్రులు కూడా అలాగే అనుకున్నారు.
మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలు భద్రమైన ఉద్యోగం చేసుకోవాలని, ప్రభుత్వోద్యోగం సంపాదించి హాయిగా జీవించాలని కోరుకుంటారు. డాక్టరో, ఇంజనీరో, బ్యాంకు ఉద్యోగో కావాలనుకుంటారు. భోపాల్ (Bhopal)కు చెందిన అంకిత్ సాహు తల్లిదండ్రులు కూడా అలాగే అనుకున్నారు. అయితే అంకిత్ మాత్రం పైలట్ (Pilot)అయి ఆకాశంలో ఎగరాలనుకున్నాడు. కష్టపడి చదివి పైలట్ ట్రైనింగ్ కోర్సులో చేరాడు. అయితే రెండో సెమిస్టర్ ఫీజు కట్టలేకపోవడంతో అతడిని ఇంటికి పంపించివేశారు. దీంతో తన గ్రామానికి చేరుకున్న అంకిత్ ఎమ్‌బీఏలో చేరి పూర్తి చేశాడు.
చదువు పూర్తయిన తర్వాత ఏదో ఉద్యోగంలో చేరడం కాకుండా సరికొత్తగా ఆలోచించి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. కరోనా సమయంలో అతడికి ఓ ఆలోచన వచ్చింది. కరోనా సమయంలో అన్నీ మూసేశారు. కానీ, కూరగాయలు, కిరాణా దుకాణాలు మాత్రం తెరుచుకునేందుకు అనుమతులిచ్చారు. ప్రజలందరికీ అన్ని వేళల్లోనూ అవసరమైన కూరగాయలను, కిరాణా సామాన్లను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందరిలా కాకుండా ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఇంటికి డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. తన సంస్థకు ``వెగోఫ్రెష్`` (Vegofresh) అని పేరు పెట్టాడు. భోపాల్‌లో ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా అంకిత్ కూరగాయలు, పండ్లు విక్రయిస్తుంటాడు (Inspirational Story).
Viral: తమ భార్యలు కనిపించడం లేదంటూ 12 మంది భర్తల ఫిర్యాదులు.. వారు ఇచ్చిన ఫొటోలు చూసి పోలీసులకు మైండ్ బ్లాక్!
``వెగోఫ్రెష్`` ఆన్‌లైన్ యాప్ ద్వారా 5,000 కంటే ఎక్కువ మంది కస్టమర్‌లు ఏర్పడ్డారు. భోపాల్ చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో కూరగాయలు, పండ్లు కొని వాటిని పట్టణంలో ఈ యాప్ ద్వారా విక్రయిస్తుంటాడు. రోజుకు 200కు పైగానే డెలివరీలు చేస్తున్నట్టు అంకిత్ తెలిపాడు. వార్షిక టర్నోవర్ 50 లక్షలకు పైగా ఉంటుందని చెప్పాడు. త్వరలోనే తన వ్యాపారాన్ని భోపాల్ నుంచి ఇండోర్, జబల్‌పూర్ వంటి నగరాలకు కూడా విస్తరింపచేయాలని అంకిత్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
Updated Date - 2023-07-17T15:43:12+05:30 IST