ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: చంద్రుడు వెళ్లిపోయేలా ఉన్నాడు.. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వ్యక్తి నుంచి పోలీసులకు ఫోన్.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-11-03T15:54:21+05:30

మనదేశంలోని మహా నగరాల్లో ట్రాఫిక్ మామూలుగా ఉండదు. కొద్ది కిలోమీటర్ల దూరం చేరుకోవడానికే గంటల కొద్దీ సమయం పడుతుంది. అలాంటి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న తర్వాత వెయిట్ చేయడం తప్ప మరో అవకాశం ఉండదు. ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

మనదేశంలోని మహా నగరాల్లో ట్రాఫిక్ (Traffic) మామూలుగా ఉండదు. కొద్ది కిలోమీటర్ల దూరం చేరుకోవడానికే గంటల కొద్దీ సమయం పడుతుంది. అలాంటి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న తర్వాత వెయిట్ చేయడం తప్ప మరో అవకాశం ఉండదు. ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. రైలు మిస్ అయిపోతుంది, ఫ్లైట్ వెళ్లిపోతుంది అని టెన్షన్ పడడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అయితే ఢిల్లీ (Delhi)లో బుధవారం జరిగిన ఓ సంఘటన మాత్రం వైరల్‌ (Viral)గా మారింది.

బుధవారం ఉత్తరాదిన చాలా మంది కర్వాచౌత్ (Karva Chauth) పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా రోజంతా ఉపవాసం ఉండే ఇల్లాలు సాయంత్రం అయ్యాక చంద్రుడి (Moon)ని చూసి ఆ తర్వాత నేరుగా భర్త ముఖాన్ని చూస్తారు. అయితే ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళ్తూ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయాడు. అతడి భార్య ఇంటి దగ్గర వెయిట్ చేస్తోంది. ట్రాఫిక్ క్లియర్ అయ్యి ఇంటికి వెళ్లే సమయానికి చంద్రుడు వెళ్లిపోతాడేమోనని అతడికి భయం పట్టుకుంది. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌‌కు ఫోన్ చేసి తన సమస్యను వివరించాడు (Delhi Police).

Funny Video: ఇది పాస్‌పోర్ట్‌నా? డైరీనా? షాకైన పాస్‌పోర్ట్ ఆఫీస్ అధికారి.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

``చంద్రుడు వెళ్లిపోయేలా ఉన్నాడు. నేను ఇంటికి వెళ్లాల్సి ఉంది. ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది`` అని తన సమస్యను వివరించాడు. ఈ ఫోన్ రాగానే వెంటనే ఆయనకు సహాయం చేయడానికి కపషేరా పోలీస్ స్టేషన్ సిబ్బంది రంగంలోకి దిగారు. నేరుగా ట్రాఫిక్ ఎస్సై రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-11-03T15:54:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising