ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Man with Woman Voice: పుట్టుకతోనే అమ్మాయి గొంతు.. మగాడివి కాదంటూ అంతా హేళన చేసినా.. ఈ కుర్రాడు ఇప్పుడేం చేస్తున్నాడంటే..

ABN, First Publish Date - 2023-05-03T19:36:21+05:30

.పాపం ఆ కుర్రాడికి పుట్టుకతోనే అమ్మాయి గొంతు వస్తే అతనికి మాటలు వచ్చినప్పటినుండి ఛీత్కారాలు, హేళనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ కారణంగానే ఆ కుర్రాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'రేయ్ వాడి గొంతు విన్నావా? అంతా అమ్మాయి గొంతే.. అసలు మగాడే కాదు అందుకే ఆ గొంతు అలాగుంది..' 'అసలువాడు మగాడు కాదు కానీ మగవాళ్ల దుస్తులు వేసుకుని మనలోకి వస్తున్నాడు ఛీ..' ఇవి పుట్టుకతోనే అమ్మాయి గొంతు వచ్చిన ఓ కుర్రాడిని ఉద్దేశించి అందరూ అనే మాటలు.పాపం ఆ కుర్రాడికి పుట్టుకతోనే అమ్మాయి గొంతు వస్తే అతనికి మాటలు వచ్చినప్పటినుండి ఇలాంటి ఛీత్కారాలు, హేళనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ కారణంగానే ఆ కుర్రాడు తన తోటి మగస్నేహితుల దగ్గరకు వెళ్ళడం తగ్గించాడు. తన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నంలో అతని ప్రయాణం గురించి తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇతని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

పశ్చిమబెంగాల్(West Bengal) రాష్ట్రం మేదినీపూర్ లోని పానిథూపియా ప్రాంతంలో సుభోజిత్ అనే కుర్రాడు ఉన్నాడు. ఇతని తండ్రి రైతు. ఇతను అబ్బాయిలానే పుట్టినా.. గొంతు మాత్రం పోత పోసినట్టు(Female voice) అమ్మాయిలాగే ఉంది. దీంతో చిన్నతనం నుండి ఇరుగు పొరుగు వారు, స్నేహితుల నుండి హేళనలే ఎదురయ్యాయి. 'వాడి గొంతు చూడు అమ్మాయిలాగుంది, అసలు మగాడు కాదు' అంటూ సుభోజిత్ ను ఏడిపించేవారు, ఎగతాళి చేసేవారు. దీంతో సుభోజిత్ తన తోటి మగస్నేహితుల జతలోకి వెళ్లకుండా తన అక్కతో కలిసి ఉండేవాడు. సుభోజిత్ అక్క రోజూ సంగీతం నేర్చుకోవడానికి(Learn to music) వెళ్లేది. అక్కతో కలసి సంగీతం క్లాసుకు(Music class) వెళ్లే సుభోజిత్ కు సంగీతం మీద ఆసక్తి కలిగింది. దీంతో తనే స్వయంగా పాటలు ఎలా పాడాలో నేర్చుకున్నాడు. అతని నివాస ప్రాంతమైన పానిథూపియాలో రుమోన్ అనే రంగస్థల నాటకశాలను సుభోజిత్ స్థాపించాడు. దీని సహకారంతో అతను డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తున్నాడు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో డ్యాన్స్ క్లాసెస్ ఇస్తూ డ్యాన్స్ టీచర్(dance teacher) గా ఇతను గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎంతో మంది పేద పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్నాడు. వీటన్నిటినీ కొనసాగిస్తూనే ఇంటి బాధ్యతను మోస్తున్నాడు.

Leftover Rice: మిగిలిపోయిన అన్నంతో మర్నాడు టిఫిన్లు చేసే అలవాటున్న వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది..!


డ్యాన్స్ అనేది ఇతనికి ఓ ఉపాధినిచ్చింది. కానీ ఇతను మాత్రం తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని అస్సలు వదిలిపెట్టలేదు. తన స్వరానికి తగిన పాటలు ఎంచుకుని అద్భుతంగా పాడతాడు. రవీంద్ర సంగీతం నుండి లతా మంగేష్కర్ పాటల వరకూ తనకు సెట్ అయ్యే ప్రతి ఒక్కటీ ఇతని గొంతులో అలా ప్రవాహంలా సాగిపోతుంది. తనలో దేన్నైతే చూసి నలుగురూ నవ్వారో దాన్నే తన బలంగా మార్చుకుని జీవితంలో మరింత ఎదగాలని ఈ కుర్రాడు చాలా పట్టుదలగా ఉన్నాడు. తన కొడుకు జీవితంలో చాలా గొప్ప స్థాయికి ఎదుగుతాడని సుభోజిత్ తండ్రి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

Viral News: పాత ఇంటిని కూల్చేస్తోంటే.. గోడల్లో బయటపడిన రూ.50 లక్షల నోట్ల కట్టలు.. ఆనందంతో ఎగిరిగంతేశాడు కానీ.. చివరకు..


Updated Date - 2023-05-03T19:36:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising