Viral News: మీ మైక్‌ను ఆఫ్ చేస్తారా..? సౌండ్స్ భరించలేకపోతున్నాం.. మీటింగ్ మధ్యలో ఓ మహిళకు మేనేజర్ మెసేజ్..!
ABN, First Publish Date - 2023-05-23T14:57:22+05:30
కరోనా తర్వాత ఉద్యోగాలు ఆఫీస్ నుంచి ఇళ్లకు చేరుకున్నాయి. ఎంతో మంది ఉద్యోగులు ఇప్పటికీ ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇంట్లో కూర్చునే మేనేజర్ల మీటింగ్‌లకు హాజరవుతున్నారు. అయితే మీటింగ్ సమయాల్లో ఉద్యోగుల ఇంట్లోని విషయాలు మేనేజర్లకు కాస్త చిరాకు తెప్పిస్తుంటాయి.
కరోనా తర్వాత ఉద్యోగాలు ఆఫీస్ నుంచి ఇళ్లకు చేరుకున్నాయి. ఎంతో మంది ఉద్యోగులు ఇప్పటికీ ఇంటి నుంచే పని చేస్తున్నారు (Work from Home). ఇంట్లో కూర్చునే మేనేజర్ల మీటింగ్‌లకు (Meeting) హాజరవుతున్నారు. అయితే మీటింగ్ సమయాల్లో ఉద్యోగుల ఇంట్లోని విషయాలు మేనేజర్లకు (Manager) కాస్త చిరాకు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియోలు ఇప్పటికే కొన్ని వైరల్ అయ్యాయి. తాజాగా వందన జైన్ అనే 28 ఏళ్ల యువతి తన ఆఫీస్ మీటింగ్‌లో జరిగిన దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
వందన ఇటీవల తన మేనేజర్ నిర్వహించిన మీటింగ్‌కు ఇంట్లో నుంచే హాజరైంది. ఆమె మీటింగ్‌లో పాల్గొంటూనే చిప్స్ తింటోంది. అయితే ఆ సమయంలో ఆమె ల్యాప్‌టాప్ మైక్ (Mic) ఆఫ్ చేయడం మర్చిపోయింది. దీంతో వందన చిప్స్ (Chips) తినే శబ్దాలు మీటింగ్‌లో ఉన్న అందరికీ వినిపించాయి. ఆ విషయం వందనకు తెలియలేదు. కొద్దిసేపటి తర్వాత వందనకు మేనేజర్ ఓ మెసేజ్ పంపించారు. ``దయచేసి మీరు మీ ల్యాప్‌టాప్ మైక్ ఆఫ్ చేస్తారా? మీరు చిప్స్ తింటున్న శబ్దం బాగా ఎక్కువగా వస్తోంద``ని మెసేజ్ చేశారు.
Viral Video: చేతిలో సంచీ పట్టుకుని.. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ బైక్‌పై మార్కెట్‌కు వెళ్తున్న ఇతడెవరో తెలిస్తే..!
ఆ మెసేజ్ చూసి షాకైన వందన వెంటనే మైక్ ఆఫ్ చేసింది. తనకెదురైన అనుభవం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయింది. ఇప్పటివరకు ఆ పోస్ట్‌ను 3 లక్షల మందికి పైగా వీక్షించారు. తమకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కొందరు పేర్కొన్నారు. కొందరు లాఫింగ్ ఎమోజీలు జత చేశారు.
Updated Date - 2023-05-23T14:57:22+05:30 IST