Manchu Manoj Mounika Marriage: విధి ఎంత చిత్రమైందంటే.. ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకున్నారు గానీ.. అప్పట్లో ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-03-04T18:20:34+05:30

పెళ్లి.. వివాహం.. పరిణయం.. లగ్గం.. కన్యాదానం.. మనువాడటం.. ఇలా రెండు మనసులు కలిసి జరుపుకునే పండుగకు పర్యాయ పదాలెన్నో. పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు, తాళిబొట్టు, తలంబ్రాలు, అతిథులు, అక్షింతలు..

Manchu Manoj Mounika Marriage: విధి ఎంత చిత్రమైందంటే.. ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకున్నారు గానీ.. అప్పట్లో ఏం జరిగిందంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెళ్లి.. వివాహం.. పరిణయం.. లగ్గం.. కన్యాదానం.. మనువాడటం.. ఇలా రెండు మనసులు కలిసి జరుపుకునే పండుగకు పర్యాయ పదాలెన్నో. పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు, తాళిబొట్టు, తలంబ్రాలు, అతిథులు, అక్షింతలు మాత్రమే కాదు. పెళ్లంటే నూరేళ్ల పంట. రెండు మనసులు, ఇద్దరు మనుషులు కలిసి చేయాల్సిన ప్రయాణం. ఈ ప్రయాణంలో కొన్ని జంటలు అభిప్రాయ భేదాల మూలంగా మధ్యలోనే ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. తమకు తగిన మరో వ్యక్తిని తోడు చేసుకుని పెళ్లి తంతుతోనే ఒక్కటై సాఫీగా సాగిపోతుంటారు. తాజాగా వేద మంత్రాల నడుమ ఒక్కటైన మంచు మనోజ్, మౌనికా రెడ్డి (Manchu Manoj Marriage) ఆ కోవలోకే వస్తారు. మనసులు కలవడంతో మనోజ్, మౌనిక ఒక్కటయ్యారు.

అయితే.. విధి ఎంత చిత్రమైందంటే.. అతిథిగా వెళ్లిన వ్యక్తినే ఆమెకు వరుడయ్యేలా చేసింది. ఇద్దరినీ భార్యాభర్తలుగా ఒక్కటి చేసింది. అవును.. 2016లో భూమా మౌనిక (Bhuma Mounika) నిశ్చితార్థ వేడుకకు మంచు కుటుంబం (Manchu Family) నుంచి మనోజే హాజరు కావడం కొసమెరుపు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ వేడుక జరిగింది. భూమా నాగిరెడ్డి కొడుకు మనోజ్‌కు పక్కనే ఉండి మర్యాదలు కూడా చేయడం గమనార్హం. ఆ వధువు మెడలోనే అతిథిగా వెళ్లిన మనోజ్ తాళి కట్టే రోజొకటి వస్తుందని ఆ సమయంలో ఏ ఒక్కరికీ ఊహించి ఉండరు. మౌనిక మొదటి పెళ్లికీ మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణుతో పాటు మనోజ్ కూడా హాజరు కావడం గమనార్హం.

భూమా మౌనిక నిశ్చితార్థం 2016లో జరగ్గా, 2015లోనే మంచు మనోజ్‌కు ప్రణతితో వివాహం జరిగింది. 2019 అక్టోబర్ 17న మనోజ్, ప్రణతి వివాహ బంధానికి స్వస్తి పలికారు. భూమా మౌనికకు కూడా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అయిన గణేష్ రెడ్డితో మొదటి వివాహం జరిగింది. రెండేళ్ల క్రితం ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మంచు మనోజ్, భూమా మౌనిక కలిసి గణేష్ మండపానికి వెళ్లడంతో ఈ ఇద్దరూ కలిసి ఉంటున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. పుకార్లకు చెక్ పెడుతూ పెద్దల సమక్షంలో మంచు మనోజ్, మౌనిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

మౌనిక అమ్మానాన్న శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఇద్దరూ కాలం చేయడంతో ఆమె సోదరి, మాజీ మంత్రి అఖిల ప్రియ ఈ కుటుంబం తరపున పెద్దగా వ్యవహరించారు. మంచు కుటుంబం తరపున మోహన్ బాబు, ఆయన భార్య పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం గమనార్హం. మోహన్ బాబు ఆశీర్వదించగానే మౌనిక భావోద్వేగానికి లోనైన దృశ్యాలు మంచు మనోజ్, మౌనిక పెళ్లికే హైలైట్‌గా నిలిచాయి.

Updated Date - 2023-03-04T18:23:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising