Manoj Love story: 12 ఏళ్ల పరిచయం.. నాలుగేళ్ల ప్రేమ.. కానీ ఆ ఇంట్రెస్ట్‌ లేదు!

ABN, First Publish Date - 2023-03-06T16:52:25+05:30

నాలుగేళ్ల ప్రేమ ఫలించి భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని నటుడు మంచు మనోజ్‌ అన్నారు.

Manoj Love story: 12 ఏళ్ల పరిచయం.. నాలుగేళ్ల ప్రేమ.. కానీ ఆ ఇంట్రెస్ట్‌ లేదు!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నాలుగేళ్ల ప్రేమ ఫలించి భూమా మౌనికా రెడ్డిని(Mounika reddy) పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని నటుడు మంచు మనోజ్‌ (manchu manoj) అన్నారు. సోమవారం ఆయన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడరు. ‘‘జీవితంలో ఏ విషయంలోనైనా ఓడిపోవచ్చు. కానీ, ప్రేమలో గెలవాలి. ఇది నేను ఎప్పుడూ నమ్మే సూత్రం. (Manoj - Mounika love story) ఎందుకంటే ఇప్పుడు నా విషయంలో ప్రేమే గెలిచింది. 12 ఏళ్లగా మౌనిక నాకు తెలుసు. నాలుగేళ్ల క్రితం నేను వేరే లోకంలో ఉన్నప్పుడు మౌనిక నాకు సపోర్ట్‌గా నిలిచింది. అలా, మేమిద్దరం మరింత దగ్గరయ్యాం.. ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలబడ్డాం. దేవుడి దయ వల్ల అందరూ కలిసి మా పెళ్లి చేశారు. దైరవ్‌ నా జీవితంలోకి రావడం కూడా శివుడి ఆజ్ఞగా భావిస్తా. ప్రజలకు ేసవ చేయాలనే ఉద్దేశం మా ఇద్దరికీ ఉంది. మా ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటే. అయితే, నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. తనకు ఆసక్తి ఉంటే నేను సపోర్ట్‌గా నిలబడతా’’ అని మనోజ్‌ చెప్పారు. (Manoj weds Mounika reddy)

Updated Date - 2023-03-06T17:56:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising