Marriage: పెళ్లికి వచ్చిన బంధువులు చేసిన నిర్వాకంతో వరుడికి కొత్త తలనొప్పి.. పెళ్లయిన మర్నాడే జరిగింది తెలిసి..!
ABN, First Publish Date - 2023-05-23T16:07:07+05:30
ఏర్పాట్లకు తగ్గట్టుగానే పెళ్లి సజావుగా జరిగిపోయింది. వరుడు వధువును ఎంతో సంతోషంగా అత్తగారింటికి తీసుకెళ్ళాడు. కానీ మరుసటిరోజే అతనికి షాక్ తగిలింది. బంధువులు చేసిన పనికి..
పెళ్ళంటే బంధువులు, అతిథులు, స్నేహితుల మధ్య ఎంతో వైభవంగా జరిగే వేడుక. ఓ కుర్రాడు తన పెళ్ళిని గుడిలో ప్లాన్ చేశాడు. ఏర్పాట్లకు తగ్గట్టుగానే పెళ్లి సజావుగా జరిగిపోయింది. వరుడు వధువును ఎంతో సంతోషంగా అత్తగారింటికి తీసుకెళ్ళాడు. కానీ మరుసటిరోజే అతనికి షాక్ తగిలింది. గుడిలో బంధువులు చేసిన పనికి పాపం కొత్త పెళ్ళికొడుకుకు పెద్ద తలనొప్పి వచ్చిపడింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం గ్వాలియర్(Gwalior) మున్సిపల్ కార్పోరేషన్ లో దిలీప్ శాక్యా అనే అబ్బాయి నివసిస్తున్నాడు. అతని పెళ్ళి స్థానిక వినాయకుడి గుడిలో)Ganesh temple) నిశ్చయమైంది. దీంతో బంధువులు, స్నేహితులు, అతిథులు అందరూ గుడికి వచ్చారు. వారందరికీ పెళ్ళి భోజనాలు కూడా గుడిలోనే ఏర్పాటు చేశారు. అయితే పెళ్లికి వచ్చిన బంధువులు, అతిథులు భోజనాల దగ్గర దారుణంగా ప్రవర్తించారు. వారు భోజనం చేసి, ప్లేట్లలో మిగిలిన అన్నాన్ని(Left over food) గుడి ప్రాంగణం, గుడి చుట్టుప్రక్కల(Temple area) అంతా ఇష్టానుసారం వేశారు. దీంతో ఆ గుడి ఉన్న ఏరియా మొత్తం చాలా అపరిశుభ్రంగా తయారైంది. మరుసటిరోజుకే దుర్గంధం వెధజల్లడం మొదలుపెట్టింది. చుట్టుప్రక్కల నివసించేవారు అందరూ మున్సిపల్ కార్యాలయలంలో ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్ళి జరిగిన మరుసటిరోజు మున్సిపల్ కార్పోరేషన్ వరుడికి(Municipal corporation fined to Groom) జరిమానా విధించింది. జరిమానా మొత్తం 1000/-రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేసింది. అది పెద్ద మొత్తం కాకపోయినా శుభమా అని పెళ్ళిచేసుకుని భార్యతో ఇంటికి వచ్చాక ఇలాంటి సంఘటన ఎదురుకావడంతో పెళ్ళికొడుకు తల పట్టుకున్నాడు.
Viral Video: బండిని ఓ మహిళ డ్రైవ్ చేస్తోంటే.. కారులో వెళ్తూ ఎవరో వీడియో తీస్తున్నారని.. వెనుక కూర్చున్న యువతి ఏం చేసిందో చూస్తే..!
గ్వాలియర్ లో పర్యావరణ పరిశభ్రత గురించి ప్రచారాలు చాలా నిర్వహిస్తుంటారు. అక్కడి వారు పరిశుభ్రతకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటిది పెళ్ళి వేడుక సందర్భంగా ఇలా జరగడంతో అక్కడివారు మండిపడ్డారు. పట్టణమంతా ఇదే విషయం గురించి చర్చ జరిగింది. మున్సిపల్ కార్పోరేషన్ వారు 'ఇంకోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోండి' అని వరుడిని, అతని కుటుంబాన్ని హెచ్చరించడంతో వరుడు తలపట్టుకున్నాడు. తన పెళ్ళివేడుక కాస్తా ఇలా చేదు అనుభవంగా మారడంతో అతను చాలా డిజప్పాయింట్ అయ్యాడు.
Viral News: అమ్మ బాబోయ్.. 22 ఏళ్ల ఈ యువతికి ప్రతీ నెలా రూ.41 లక్షల ఆదాయం.. ఏం చేసి అంత సంపాదిస్తోందో తెలిస్తే..
Updated Date - 2023-05-23T16:07:07+05:30 IST