Sravana Masam: ఇక శ్రావణ సందడి.. ఈ నెలలో ఆ రెండు రోజుల్లో భారీగా శుభ కార్యాలు..
ABN, First Publish Date - 2023-08-14T17:56:18+05:30
దాదాపు 70 రోజులు తరువాత మంగళ వాయిద్యాల హడావుడి ప్రారంభం కానుంది. 18 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభం కానున్నది. దీంతో శుభ కార్యక్రమాలు కూడా జోరందుకోనున్నాయి. జూన్ 10వ తేదీతో శుభకార్యాల హడావుడి ఆగిపోయింది.
దాదాపు 70 రోజులు తరువాత మంగళ వాయిద్యాల హడావుడి ప్రారంభం కానుంది. 18 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభం కానున్నది. దీంతో శుభ కార్యక్రమాలు కూడా జోరందుకోనున్నాయి. జూన్ 10వ తేదీతో శుభకార్యాల హడావుడి ఆగిపోయింది. ఆ తరువాత ఆషాఢం ప్రారంభం కావడం, వెంటనే అధిక శ్రావణం ప్రారంభమవడంతో శుభ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఈ అధిక శ్రావణంలోనే శుక్రమౌఢ్యం పదిరోజులు పాటు రావడం వల్ల ఈనెల 18వ తేదీ సాయంత్రం వరకు మౌఢం ఉంది. అందువల్ల శుభ కార్యక్రమాలు 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వాస్తవంగా 17వ తేదీ నుంచి నిజ శ్రావణం ప్రారంభం అవుతున్నా మౌఢ్యమి కారణంగా మరో మూడు రోజులు ఆగాల్సి వస్తోంది. ఈనెల 19 నుంచి వచ్చేనెల 10 తేదీవరకు శుభకార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నెలలో 24, 30 తేదీల్లో భారీగా శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ముహుర్తాలు పెట్టించుకున్నవారు ఏర్పాటు చేసుకుంటున్నారు.
వివాహాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు భారీగా ఉంటాయని పురోహితులు చెబుతున్నారు. 19వ తేదీ నుంచి మరింత రద్దీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా వ్యాపారస్తులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆషాఢం డిస్కౌంట్‌కు తెరపడింది. ఇప్పుడ శ్రావణమాసం డిస్కౌంట్‌తో వ్యాపారాలు ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా వచ్చేనెలలో 1,2, 6,7 తేదీల్లో ముహుర్తాలు బాగున్నాయని అంటున్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి భాద్రపద మాసం ప్రారంభం కావడంతో శూన్య మాసంగా చెబుతారు. అందువల్ల శుభకార్యక్రమాలు ఉండవని అక్టోబరు 16 వరకు ఉండవని అంటున్నారు. మరలా కొంతకాలం మూహుర్తాలు ఉండవని అక్కడ నుంచి వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఉన్నాయని అంటున్నారు.
25న శ్రావణ శుక్రవారం
ఈసారి శ్రావణ శుక్రవారం అధిక శ్రావణ మాసం సందర్భంగా నెలరోజుల ముందుకు వెళ్ళింది. ఈనెల 25 వ తేదీన శ్రావణ శుక్రవారం మహిళలు చేసుకోనున్నారు. ఇప్పటికే మార్కెట్‌లు కళకళలాడుతున్నాయి. ఐతే ముందు రోజు 24వ తేదీన బలమైన ముహూర్తం కావడంతో పూజలకు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. చాలామంది పురోహితులకు ముమూర్తం ఉండటం, 24వ తేదీ తెల్లవారుజామున 3-45 నిమిషాలకు సుముహుర్తం కావడంతో శ్రావణ శుక్రవార పూజలు ఎలా అనే ఆలోచనలో పడుతున్నారు.
Updated Date - 2023-08-14T17:56:21+05:30 IST