Marry now Pay Later Scheme: పెళ్లీడుకొచ్చిన కుర్రాళ్లకు బంపరాఫర్.. వివాహానికి ప్రత్యేక లోన్లు.. 6 నెలల్లోపు చెల్లిస్తే వడ్డీ ఉండదట..!
ABN, First Publish Date - 2023-03-29T11:56:11+05:30
ఆర్థిక ఇబ్బందులు చాలామందిని సంతోషానికి దూరం చేస్తాయి. ఘనంగా జరగాల్సిన పెళ్ళి సాదాసీదాగా జరిగిపోతుంటే ఇక మన జీవితం ఇంతేలే అని..
పెళ్ళి జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక. చాలామందికి తమ పెళ్ళి ఎంతో ఘనంగా చేసుకోవాలని, అందరూ గొప్పగా చెప్పుకునేట్టు పెళ్ళి జరగాలని ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు చాలామందిని సంతోషానికి దూరం చేస్తాయి. ఘనంగా జరగాల్సిన పెళ్ళి సాదాసీదాగా జరిగిపోతుంటే ఇక మన జీవితం ఇంతేలే అని సమాధానపరుచుకుంటారు. కానీ ఇప్పుడు అలా ఫీలవ్వాల్సిన పనిలేదు. 'మేము డబ్బులిస్తాం చక్కగా పెళ్ళి చేసుకోండి తరువాత డబ్బు చెల్లించండి' అంటూ ఓ స్కీమ్ ఆపద్బాందవిలా ఆకర్షిస్తోంది. 6నెలల లోపు ఆ డబ్బు తిరిగి చెల్లించినట్టైతే అసలు వడ్డీ లేకపోవడం ఈ పథకం వైపు అందరూ దృష్టి సారించేలా చేస్తోంది. మ్యారీ నౌ పే లేటర్(Marry Now Pay Later) అనే ఈ కొత్త స్కీమ్ గురించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..
ఇప్పట్లో ఫ్లిప్కార్, అమెజాన్ ఈ కామర్స్ సైట్(Flipkart, Amazon e-commerce sites) లలో.. బై నౌ పే లేటర్(Buy now pay later) అనే పేమెంట్ ఆప్షన్ చూసే ఉంటారు. కావలసినవి కొనుక్కుని కట్టాల్సిన డబ్బు తరువాత నెలలో కట్టడం ఇందులో వెసులుబాటు. అచ్చం ఇలాంటిది పెళ్ళివేడుక కోసం రూపొందించారు. పెళ్ళికోసం లోన్ లు ఇస్తాం హాయిగా పెళ్ళిళ్ళు చేసుకోండి అని అంటున్నారు. తీసుకున్న లోన్ డబ్బును ఆరు నెలల్లో తిరిగి ఇస్తే అసలు వడ్డీ కట్టాల్సిన(NO interest) అవసరమే ఉండదు. సంవత్సరంలోపు కట్టాలని అనుకుంటే 1శాతం వడ్డీ కట్టాలి. ట్రావెల్స్ ఫైనాన్స్(Travels Finance) Sankash ఈ సౌలభ్యం కల్పిస్తోంది. పిల్లలకు ఘనంగా పెళ్ళి చేయాలని ప్రతి తల్లిదండ్రులు ఆశ పడతారు, తమ పెళ్ళి గొప్పగా జరగాలని ప్రతి యువతీ యువకులు కలలు కంటారు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా అనుకున్న పెళ్ళిళ్లు జరగవు. అలాంటి వారు ఈ మ్యారీ నౌ పే లేటర్(Marry Now Pay Later) ను సద్వినియోగం చేసుకోవచ్చు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 35లక్షల పెళ్ళిళ్ళు జరుగుతాయి . ఈ పెళ్ళిళ్ళ ద్వారా జరిగే మార్కెట్ విలువ అక్షరాలా 4ట్రిలియన్లు. అంటే 4లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇంతమందిలో చాలావరకు ఆర్థిక స్థితి సరిగా లేక పెళ్ళిళ్లు తూతూమంత్రంగా కానిచ్చేస్తారు. కానీ ఈ మ్యారీ నౌ పే లేటర్ స్కీమ్ వల్ల అందరూ సంతోషంగా పెళ్ళిచేసుకునే వెలుసుబాటు దొరికింది. ఈ పథకం గురించి అనౌన్స్ చేసిన వారంలోపే ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు సంస్థ అధికారులు తెలిపారు. ఈ పథకం కింద క్యాటరింగ్, హోటల్స్, ఫంక్షన్ హాల్ డెకరేషన్, జ్యువెలరీ, బట్టలు, వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ఖరీదైన వస్తువుల సౌలభ్యం కూడా ఉంది. ఈ కారణంగా పెళ్ళిళ్ళ విషయంలో రెండు కుటుంబాల మీదా ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఒక కస్టమర్ గరిష్టంగా 25లక్షలు పొందే అవకాశం ఉంది. ఈ లోన్ పొందడానికి కస్టమర్లు బ్యాంక్ ఖాతా వివరాలు వారికి అందించాల్సి ఉంటుంది.
Read also: Viral Video: ఇలాంటి ప్రయోగం మీరెప్పుడూ చూసుండరు.. ఈ టీచర్ ఎంతబాగా చూపించారో చూడండి!
Updated Date - 2023-03-29T11:56:11+05:30 IST