అక్కడి స్కూళ్లు, కాలేజీల్లో మాస్క్ తప్పనిసరి... గేటు దగ్గరే థర్మల్ స్కానింగ్... అధికారిక మార్గదర్శకాలు జారీ!
ABN, First Publish Date - 2023-04-16T11:16:25+05:30
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), నోయిడాలలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ(Department of Health) కీలక నిర్ణయం తీసుకుంది.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), నోయిడాలలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ(Department of Health) కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు మాస్క్ తప్పనిసరి చేసింది. అలాగే ఆయా పాఠశాలల(schools) గేటు వద్దే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్(Thermal screening) చేయాలని ఆదేశించింది. ఎవరైనా విద్యార్థి అనారోగ్యంతో కనిపిస్తే, వారిని వెంటనే వెనక్కి పంపుతారు. అలాగే ఎవరైనా విద్యార్థికి జలుబు, ఫ్లూ లక్షణాలు కనిపిస్తే, వారిని పాఠశాల లోనికి అనుమతించరు.
ఇతరుల ఆరోగ్య భద్రత(Health security) కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నారు. మాస్క్‌లు, థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు, పిల్లలు దూరంగా కూర్చునేలా చూడాలని కూడా పాఠశాలలకు ఆరోగ్యశాఖ సూచించింది. అలాగే విద్యార్థులకు శానిటైజర్(Sanitizer), సబ్బు ఏర్పాటు చేయాలి. అంతే కాకుండా టీకా వేయడానికి అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలి.
బూస్టర్ డోస్(Booster dose) కూడా అందుబాటులో ఉంచాలి. ఇటీవల నోయిడాలో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. ఏప్రిల్ 13న 114 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఘజియాబాద్(Ghaziabad)లో 108 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
Updated Date - 2023-04-16T11:24:34+05:30 IST