ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

mass suicide: హిట్లర్ ఆత్మహత్యతో అనూహ్య బలవన్మరణాలు... నేటికీ వెల్లడికాని రహస్యాలు ఇవే అంటున్న చరిత్ర కారుడు...

ABN, First Publish Date - 2023-03-18T09:10:50+05:30

mass suicide: జర్మన్ నియంత హిట్లర్ 1945, ఏప్రిల్ 30న ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. ఆ తర్వాత జర్మనీ.. నాజీల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీని తరువాత జర్మనీ(Germany)లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

mass suicide: జర్మన్ నియంత హిట్లర్ 1945, ఏప్రిల్ 30న ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. ఆ తర్వాత జర్మనీ.. నాజీల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీని తరువాత జర్మనీ(Germany)లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. వేలాది మంది జర్మన్ పురుషులు, మహిళలు, పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని మాస్ సూసైడ్ వేవ్(Mass suicide wave) అని అంటారు.

ఈ ఆత్మహత్యల ఉదంతం గురించి లోకానికి అంతగా తెలియదు. అయితే 2015వ సంవత్సరంలో ఈ అంశాన్ని వివరిస్తూ ఒక జర్మన్ పుస్తకం వెలువడినప్పుడు, అది బెస్ట్ సెల్లర్ పుస్తకంగా నిలిచింది. చరిత్రకారుడు ఫ్లారియన్ హుబర్(Florian Huber) రచించిన ఈ పుస్తకం 'ప్రామిస్ మి యు విల్ షూట్ యువర్' పేరుతో విడుదలయ్యింది. పలు సంచలన సంఘటనలను(Sensational events) రచయిత ఇందులో వెల్లడించారు. 2015 సంవత్సరంలో ఒక ఇంటర్వ్యూలో పుస్తక రచయిత హుబెర్ మాట్లాడుతూ... ఆ సమయంలో సోవియట్ యూనియన్‌(Soviet Union)ను జర్మనీకి శత్రువుగా భావించేవారని తెలిపారు. సోవియట్ సైన్యాన్ని రెడ్ ఆర్మీ(Red Army) అని కూడా పిలుస్తారు.

హిట్లర్ మరణం తరువాత ఎర్ర సైన్యం తమను హింసించి, హత్య చేస్తుందనే భయం జర్మనీ ప్రజలలో(people) వ్యాపించింది. ఈ భయం కారణంగా చాలామంది బలవన్మరణానికి పాల్పడ్డారు. హుబెర్ తన పుస్తకంలో ఇలాంటి విషయాలను ప్రస్తావించాడు, ఎర్ర సైన్యపు దాడుల నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్యనే ఏకైక మార్గం అని నాటి ప్రజలు భావించారని హుబెర్ పేర్కొన్నారు. జనం ఆత్మహత్యకు పాల్పడేందుకు నీట మునిగిపోవడం. తనను తాను తుపాకీతో కాల్చుకోవడం(Shooting), ఉరి వేసుకోవడం లేదా విషం సేవించడం మొదలైన మార్గాలను ఆశ్రయించారని పేర్కొన్నారు. ఇది ఎవరూ చెప్పని, వినని కథ(unheard story) అని కూడా హుబెర్ ఆ పుస్తకంలో రాశారు.

Updated Date - 2023-03-18T09:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising