ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chiranjeevi: డైరెక్టర్స్‌కు చిరంజీవి క్లాస్

ABN, First Publish Date - 2023-01-14T21:00:22+05:30

మెగాస్టార్ చిరంజీవి దర్శకులకు చురకలంటించాడు. నిర్మాతల డబ్బును వృథా చేయొద్దని డైరెక్టర్స్‌కు హితవు పలికాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chirajeevi) హీరోగా నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). శ్రుతి హాసన్ హీరోయిన్ పాత్రను పోషించింది. బాబీ కొల్లీ (Bobby Kolli) దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జనవరి 13న విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా సక్సెస్‌మీట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడాడు. దర్శకులకు చురకలంటించాడు. నిర్మాతల డబ్బును వృథా చేయొద్దని డైరెక్టర్స్‌కు హితవు పలికాడు.

‘‘బాబీ చెప్పిన కథ అందరికీ నచ్చింది. ఆ తర్వాత పర్సనల్‌గా మాట్లాడాలని బాబీని నా గదికి తీసుకెళ్లా. ‘ఈ కథ జస్ట్‌ బిలో యావరేజ్‌. ఇది ఒక ముడి వజ్రం. ఇది పెట్టుకుని మనం ఏమీ చేయలేం. దీనిని అందమైన ఆభరణంగా మార్చాలి. చాలా కష్టపడాలి. నువ్వు స్క్రిప్ట్‌‌ను పూర్తి చేసిన ప్రతిసారీ నాకు చెప్పు. నచ్చితే సినిమా చేద్దాం. లేకపోతే మళ్లీ మార్పులు చేసుకుని రావాలి’ అన్నప్పుడల్లా ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. అదే బాబీ గొప్పతనం. ఇలా చెబితే, ఎవరికైనా ఇగో అడ్డొస్తుంది. ఇంత కన్నా బాగా ఎవరైనా రాయగలరా అని సంతృప్తి పడిపోతారు. సంతృప్తి పడిపోయారట్టే స్క్రిఫ్ట్ స్థాపితం అయిపోయినట్లే. అది మాత్రం చేయొద్దు బాబీ అన్నాను. కథ మార్పులు చేయమంటుంది. డెవలప్ చేయాలని కోరుతుంది. బాబీ దానిని అర్థం చేసుకుని చెక్కుతూనే ఉన్నాడు. ప్రతి సీన్‌లో మార్పులు చేశాడు. ఈ సినిమా అందమైన స్క్రీన్ ప్లే. ప్రతి ఒక్కరు ఇదొక కేస్ స్టడీగా చూడాలి’’ అని చిరంజీవి తెలిపాడు.

‘‘కోర్టులో ప్రకాశ్‌రాజ్‌ తల నరకడానికి బలమైన కారణం కనపడటం లేదు’ బాబీకి అని చెప్పా. అందుకు బలమైన కారణం కావాలన్నాను. మళ్లీ టీమ్‌ అంతా కూర్చొని మార్పులు చేశారు. అదే విషయం నాకు చెబితే, ‘50శాతం బాగుంది. అది కూడా సరిపోదు. తలనరికేంత కోపం రావాలంటే ఇంకేదో కావాలి’ అన్నాను. టీమ్ అంతా వెళ్లిపోయరన్నాడు. అయితే, అందరినీ పిలిపించమన్నాను. రాత్రి 2.30గంటల వరకూ కూర్చొని ఇంకొన్ని మార్పులు చేశారు. అప్పుడు ఓకే చెప్పా. స్క్రిఫ్ట్‌ను ఎంత చెక్కితే అంత వస్తుంది. బాబీ గొప్పవాడు. ఎందుకంటే 44 సంవత్సరాల నా అనుభవానికి విలువ ఇచ్చాడు. ‘ఇది నా కథ. ఆర్టిస్ట్‌లుగా వాళ్లు చెప్పేదేంటి? నేను ఎలా చెబితే అలా నటించాలి’ అన్న గర్వానికి అతడు పోలేదు. కథను బాగా చెక్కాడు. అందరూ కలిసి కథకు సరెండర్‌ అయ్యారు. అందుకనే అనుభవం ఉన్న వ్యక్తులు అనుమానం వ్యక్తం చేస్తే, విలువ ఇచ్చి, కూర్చొని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు. మార్పులు చేశాడు. అద్భుతమైన కథతో వచ్చాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నిద్రపోకుండా పని చేస్తూనే ఉన్నాడు. బాబీని పొగుడాలని నేను చెప్పడం లేదు. అతడి పడిన కష్టాన్ని మీకు వివరిస్తున్నాను’’ అని మెగాస్టార్ చెప్పాడు.

‘‘సినిమాలో అదనంగా సీన్స్‌ ఉంటే, ఆ పేపర్‌లను చింపేసి పారేయమని చెప్పేవాడిని. అనవసరంగా సీన్స్ తీసి నిర్మాతల డబ్బు, ఆర్టిస్టుల సమయాన్ని బుట్టదాఖలు చేయొద్దని చెప్పా. ఇలా చెబితే వినేవాళ్లు ఇప్పుడు తగ్గిపోయారు. నేను చెప్పింది 100శాతం ఫాలో అయ్యాడు. ‘అరగంట, గంట సినిమా వేస్ట్ చేశాం. ఎడిటింగ్‌ రూమ్‌లో మరింత కథ ఉంది’ అనే మాటలు వింటూనే ఉన్నాం. అదేమీ అబద్ధం కాదు. మా సినిమాను ఏడున్నర నిమిషాలు మాత్రమే ఎడిట్ చేశాం. గరిష్ఠంగా పది నిమిషాలు పక్కన పెట్టాం. ఫైట్ సీక్వెన్స్‌లో కాస్త ఎక్కువ తీశాం తప్ప, నిర్మాతలకు నయా పైసా వృథా కాలేదు. నేను అనే మాటలకు చిన్నా, పెద్ద దర్శకులు హర్ట్‌ అవుతారేమో, ‘సినిమా అంటే సూపర్‌ డూపర్‌ హిట్ ఇవ్వడం కాదు. నిర్మాతలకు చెప్పిన బడ్జెట్‌లో సమయానికి పూర్తి చేసి ఇవ్వాలి. అదే మొదటి సక్సెస్‌‌గా ప్రతి ఒక్కరు అనుకోవాలి. కొత్త టెక్నాలజీ వాడి పనితనం చూపించడం కంటే, కథను నమ్మి మాములు కెమెరాతోనూ అద్భుతమైన సినిమా తీయాలి. ఏది అడిగినా ఇచ్చే నిర్మాతలు ఉంటే మరింత భారం అవుతుంది. ఇండస్ట్రీ బాగుండాలంటే, బాధ్యత తీసుకునేవాళ్లు, అది గుర్తరెగాల్సిన వాళ్లు దర్శకులు మాత్రమే. ఎందుకంటే వాళ్లే కెప్టెన్ ఆఫ్ ద షిప్. నేను ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ మాటలు అనడం లేదు. దీన్ని మీడియా వేరే వాళ్లకు ఆపాదించి రాయవచ్చు. ఇండస్ట్రీ బాగుండాలనే విశాల దృక్పథంతో ఈ మాటలు చెబుతున్నాను. దర్శకుడు అనేవాళ్లు నిర్మాతలను బతికించాలి. ఈ సినిమా యావరేజ్‌గా ఆడినా నా నిర్మాతలు నష్టపోరు. అయినప్పటికీ, బ్లాక్ బాస్టర్ అయింది. కొంత మది దర్శకులు ఒక సినిమాకు ఎక్కువ సన్నివేశాలు తీసినా చెల్లుతుంది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘బాహుబలి’ వంటి చిత్రాలకు అది కుదిరింది. కొంచెం క్లాస్‌ ఎక్కువ తీసుకున్నాననుకుంటా. ఏదేమైనా నిర్మాతలు బాగుండాలి. వాళ్లు బాగుంటేనే మళ్లీ సినిమాలు చేస్తారు. ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. నా తమ్ముడు రవితేజ లేకపోయుంటే, ఈ సినిమా సెకండాఫ్‌లో ఇంత అందం వచ్చేది కాదు. రవితేజ అద్భుతంగా నటించాడు. చెంప దెబ్బ కొట్టే సీన్‌ ఉంటే మరింత గట్టిగా కొట్టమనేవాడు’’ అని చిరు పేర్కొన్నాడు.

Updated Date - 2023-01-14T21:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising