ఈ పని చేస్తే పురుషులు ఎప్పటికీ నాన్న కాలేరు... వదులుగా ఉండే కాటన్ బాక్సర్లు ధరించడమే పరిష్కార మంటున్న శాస్త్రవేత్తలు!
ABN, First Publish Date - 2023-03-28T11:09:44+05:30
బిగుతుగా ఉండే చెడ్డీలు వేసుకునే వారి స్పెర్మ్ కౌంట్(Sperm count).. కాస్త వదులుగా ఉండే చెడ్డీలు వేసుకునే వారి స్పెర్మ్ కంట్ కంటే తక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో(research) వెల్లడయ్యింది.
బిగుతుగా ఉండే చెడ్డీలు వేసుకునే వారి స్పెర్మ్ కౌంట్(Sperm count).. కాస్త వదులుగా ఉండే చెడ్డీలు వేసుకునే వారి స్పెర్మ్ కంట్ కంటే తక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో(research) వెల్లడయ్యింది. ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి శరీర ఉష్ణోగ్రత- స్పెర్మ్ కౌంట్ మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. బిగుతుగా ఉండే లోదుస్తులను ధరిస్తే, స్క్రోటమ్(scrotum) వేడిగా మారుతుంది.
అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడం ప్రారంభమవుతుంది. అందుకే ఎప్పుడూ బిగుతుగా ఉండే చెడ్డీలు వేసుకోకూడదని వైద్యులు సూచిస్తుంటారు. ఇటువంటి ముప్పును నివారించాలనుకుంటే ముందుగా టైట్ ప్యాంటు(Tight pants), టైట్ చెడ్డీలు ధరించడం మానేయాలి. మీ శృంగార ఆరోగ్యం(Sexual health) మెరుగ్గా ఉండాలంటే కొంచెం వదులుగా ఉండే దుస్తులను ధరించండి.
వీలైతే రాత్రి పడుకునేటప్పుడు లోదుస్తులు ధరించవద్దు. దీనికి బదులుగా వదులుగా ఉండే కాటన్ బాక్సర్లను(Cotton boxers) ధరించి నిద్రకు ఉపక్రమించండి. ఇలా చేస్తే వృషణాలు చల్లగా ఉంటాయి. అప్పుడు స్పెర్మ్ కౌంట్(Sperm count) పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరోవైపు ల్యాప్‌టాప్(Laptop)ను ఎక్కువసేపు ఉపయోగిస్తూ, దానిని కాళ్ళపై ఉంచడం హానికరంగా పరిణమిస్తుంది.
ఇలా చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం వలన దాని వేడి నేరుగా స్క్రోటమ్‌కు వెళుతుంది ఫలితంగా స్పెర్మ్ కౌంట్ పడిపోతుందని శాస్త్రవేత్తలు(Scientists) హెచ్చరిస్తున్నారు. స్పెర్మ్ కౌంట్ బాగుంటేనే పిల్లలు పుట్టేందుకు అవకాశం(opportunity) ఉంటుందనే విషయం తెలిసిందే!
Updated Date - 2023-03-28T11:09:44+05:30 IST