ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mens Pregnancy Test: మగాళ్లు ప్రగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే జరిగేదేంటి..? పాజిటివ్ రిజల్ట్ వస్తే ఆ రిస్క్ ఉన్నట్టేనా..?

ABN, First Publish Date - 2023-02-23T16:41:31+05:30

ప్రెగ్నెన్సీ కిట్‌తో మగాళ్లు పరీక్షలు చేస్తే ఎందుకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది.. అందరికీ కాకున్నా కొందరికే పాజిటివ్ ఎందుకు వస్తుంది..?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తరుణ్ అనే ఓ 35 ఏళ్ల వ్యక్తికి ఓ చిలిపి ఆలోచన వచ్చింది. ప్రెగ్నెన్సీ కిట్‌ను స్త్రీలు మాత్రమే వాడతారు కదా.. అసలు ఆ టెస్ట్‌ను మగాళ్లు చేస్తే ఏమవుతుంది..? పాజిటివ్ గా రిజల్ట్ వస్తుందా..? నెగిటివ్ గా రిజల్ట్ వస్తుందా..? అన్న ఊహ అతడికి వచ్చింది. అనుకున్నదే తడవుగా ఓ కిట్ ను తెచ్చాడు.. టెస్టును చేశాడు.. అంతే రిజల్ట్ చూసి ఉలిక్కి పడ్డాడు.. ప్రెగ్నెన్సీ కిట్‌లో పాజిటివ్ అన్న రిజల్ట్ చూసి నివ్వెరపోయాడు. ఇదేదో కిట్ పాడయిపోయి ఉంటుందని మరో కిట్ తో కూడా టెస్ట్ చేశాడు. సేమ్ రిజల్ట్ వచ్చింది. అంతే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పాడు. ఆ తర్వాత డాక్టర్ చెప్పింది విని నోరెళ్లబెట్టడం తరుణ్ వంతయింది.. అసలు ప్రెగ్నెన్సీ కిట్‌తో మగాళ్లు పరీక్షలు చేస్తే ఎందుకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది.. అందరికీ కాకున్నా కొందరికే పాజిటివ్ ఎందుకు వస్తుంది..? దానికి కారణమేంటి..? అలా వస్తే అనారోగ్య సమస్యలు ఉన్నట్టేనా.?

సాధారణంగా ఆడవారు ప్రెగ్నెన్సీ టెస్ట్(Pregnancy Test) చేసుకున్నప్పుడు వారు గర్భవతులు అయితే వారిలో హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్(Human Chorionic Gonadotropin) అనే హార్మోన్(Hormone) విడుదల అవుతుంది. ఆ హార్మోన్ కారణంగానే వారు గర్భవతులు అనే విషయం తెలుస్తుంది. ఆ హార్మోన్ కారణంగానే ప్రెగ్నెన్సీ టెస్టు రిజల్ట్ కూడా పాజిటివ్ వస్తుంది. స్త్రీలు గర్భం దాల్చినప్పుడు విడుదలయ్యే అదే హార్మోన్.. మగాళ్లలో కూడా విడుదల అవుతూ ఉంటుంది.. అయితే అన్ని సమయాల్లోనూ కాదు. మగాళ్లలో వృషణాల క్యాన్సర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ హార్మోన్ విడుదలవుతుంది. వృషణాల క్యాన్సర్ ఉన్న మగాళ్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఈ హార్మోన్ ప్రభావం వల్ల పాజిటివ్ రిజల్ట్‌ వస్తుంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన మగవారికి వృషణాల క్యాన్సర్ ఉండే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. 2012 నుంచే వైద్యవిధానంలో మగాళ్లకు ఇలా టెస్ట్ చేసి వృషణాల క్యాన్సర్‌ను తెలుసుకునే విధానం ఉన్నా జన ప్రాచుర్యంలో లేకపోవడం వల్ల ఎక్కువ మందికి తెలియదు. అందులోనూ అరుదుగా వచ్చే వృషణాల క్యాన్సర్ వంటివి కేవలం ఈ ఒక్క టెస్టుతోనే తేల్చడం కూడా సరికాదన్నది వైద్యుల మాట.

Read also: Viral Video: దంచి కొడుతున్నాడు భయ్యా.. స్ట్రీట్ సెల్లర్ ప్రమోషన్ మామూలుగా లేదుగా..


మగవారిలో వృషణాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా, వారి కుటుంబాల్లో గతంలో ఎవరికి అయినా క్యాన్సర్(Cancer) వంటి జ్బబులు వచ్చి ఉన్నా వారికి వృషణాల క్యాన్సర్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు తమలో ఉన్న క్యాన్సర్ ను కనుక్కోవడానికి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ కాస్త ఉపయోగపడుతుందన్న మాట వాస్తవమే. ముందుగానే ఈ వ్యాధిని కనుక్కోవడం వల్ల దీన్ని అధిగమించే అవకాశం ఎక్కువ ఉంటుంది. వృషణాలలో సెమినోమాస్(Seminomas) అనే కణాలలో స్పెర్మ్(Sperm) ఉత్పత్తి అవుతుంది. ఈ స్పెర్మ్ ఉత్పత్తయ్యే కణుతుల్లో సుమారు 15శాతం, ఇతర కణాలలో 20 నుండి 40శాతం కణాలు మాత్రమే HCG హార్మోన్ ను స్రవిస్తాయి. ప్రస్తుతం అభివృద్ది చెందిన ఇప్పటి వైద్యరంగంలో కూడా వృషణాల క్యాన్సర్ లో 50శాతం కణుతులు మాత్రమే ఈ క్యాన్సర్ కారక హార్మోన్ ను స్రవిస్తాయని, మిగిలిన క్యాన్సర్ కణుతుల గురించి స్పష్టత లేదని వైద్యులు తెలిపారు. అయితే తమకు వృషణాల క్యాన్సర్ ఉందేమోనని అనుమానించే మగవారు ఈ ప్రెగ్నెన్సీ పరీక్షను ఇంట్లో చేసుకోవడం సరికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులను నిర్థారించుకోవడంలో తప్పనిసరిగా వైద్యుల సలహాలు, సూచనలను తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కేవలం ఈ ఒక్క పరీక్షతోనే వృషణాల కేన్సర్‌ను తేల్చలేమనీ.. ఈ టెస్టులో నెగిటివ్ రిజల్ట్ వచ్చి కూడా వృషణాల కేన్సర్ బారిన పడ్డ వాళ్లు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ టెస్టును మాత్రమే ప్రామాణికంగా తీసుకుని వృషణాల కేన్సన్ నిర్ధారణ జరగదని కూడా తేల్చిచెబుతున్నారు.

Updated Date - 2023-02-23T16:41:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising