MGNREGS: ఉపాధి హామీ పనులకు వెళ్లే వాళ్లకు ఇంపార్టెంట్ అలెర్ట్.. ఆగస్టు 31వ తారీఖు లోపే ఈ పని చేయకపోతే..!
ABN, First Publish Date - 2023-08-29T15:51:32+05:30
ఉపాధి పనులకు వెళ్ళేవారు ఆగస్టు 31వ తేదీలోపు ఓ ముఖ్యమైన పని చెయ్యాల్సి ఉంది. ఆ తరువాత ఎంత మొత్తుకున్నా ఒక్కరూపాయి కూడా లభించదు.
గ్రామీణాభివృద్దిలో భాగంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే యోచనలో ప్రజలనే మమేకం చేస్తూ వారికి వేతనాలు చెల్లించేదిశగా ప్రభుత్వం పథకం రూపొందించింది. అదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGS). అందరూ ఉపాధి హామీ పథకం అంటూ పిలుచుకునే ఈ పనులు గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారికి నిజంగా ఒక వరమే అని చెప్పవచ్చు. అయితే ఈ పనులకు వెళ్ళేవారు ఈనెల 31వ తేదీలోపు ఓ ముఖ్యమైన పని చెయ్యాల్సి ఉంది. ఆ తరువాత ఎంత ప్రయత్నం చేసినా ఒక్కరూపాయి కూడా లభించదు. పూర్తీగా డబ్బు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉపాధి పనుల విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఏమిటి? నగదు చెల్లింపులు ఎలా ఉంటాయి మొదలైన వివరాలు పూర్తీగా తెలుసుకుంటే..
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద పనులకు వెళ్లేవారికి ఆదార్ ఆధారంగా నగదు చెల్లింపులు చేసే ప్రక్రియను(ABPS) ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఏర్పాటుచేసింది. మొదట ఈ గడువును ఫిబ్రవరి 1వరకు పేర్కొంది. కానీ ఆ తరువాత ఈ గడువును మార్చి 31కి పొడిగించింది. మార్చి 31 నుండి జూన్ 30వరకు, ఆ తరువాత మళ్లీ జూన్ 31 నుండి ఆగస్టు 31వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న దాన్ని బట్టి ఆగస్టు 31 తరువాత ఆధార్ అనుసంధానించే ప్రక్రియను పొడిగించదు. ఉపాధి పనులకు వెళ్లే ప్రతి ఒక్కరు ఈ ఆధార్ అనుసంధాన ప్రక్రియను ఆగస్టు 31వ తేదీ లోపు పూర్తీ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
Dhirubhai Ambani: నెలకు రూ.300 జీతానికి పనిచేసిన ధీరూభాయ్ అంబానీ.. వేల కోట్లను ఎలా సంపాదించాడు.. పెట్రోల్ బంక్‌లో పనిచేసి..!
జూన్ నెలలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందేవారు 14.28కోట్లు కాగా వీరిలో 13.75 కోట్ల మంది ఆధార్ ను అనుసంధానం చేశారు. వీటిలో 12.17కోట్ల నెంబర్ లు నిర్థారించబడ్డాయి. 77.81 శాతం మంది ఉపాధి హామీ పథకానికి అర్హులుగా నిర్ణయించబడ్డారు. మే నెలలో 88శాతం మందికి ఆదార్ ఆధారంగానే చెల్లింపులు జరిగాయి. సుమారు 1.13కోట్ల మంది బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసందానం జరగలేదు. వీరందరూ ఇప్పుడు అలెర్ట్ కావాల్సి ఉంది.
Bank Holidays September 2023: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఏకంగా 16 రోజుల సెలవులు.. ఈ నెలలో ఏఏ పండుగలున్నాయంటే..!
Updated Date - 2023-08-29T15:51:32+05:30 IST