Miss Universe Finalist : అందాలభామ సియెన్నా వీర్ గుర్రపు స్వారీ ప్రమాదంలో మృతి
ABN, First Publish Date - 2023-05-06T09:47:10+05:30
మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్, ప్రముఖ మోడల్ సియెన్నా వీర్ గుర్రపు స్వారీ ప్రమాదంలో మరణించారు...
మెల్ బోర్న్: మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్, ప్రముఖ మోడల్ సియెన్నా వీర్ గుర్రపు స్వారీ ప్రమాదంలో మరణించారు.(Miss Universe Finalist)2022 మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ మరియు ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ మోడల్ సియెన్నా 23 సంవత్సరాల వయస్సులో గుర్రపు స్వారీ ప్రమాదంలో మరణించినట్లు(Sienna Weir Dies) ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.మోడల్ తన స్వస్థలమైన ఆస్ట్రేలియాలో గత నెలలో గుర్రపు స్వారీ చేస్తూ ఘోర ప్రమాదానికి గురయ్యారు.(Horse Riding Accident) సియెన్నా ఏప్రిల్ 2వతేదీన ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్‌లో స్వారీ చేస్తుండగా, ఆమె గుర్రం పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోడల్ చాలా రోజులపాటు లైఫ్ సపోర్ట్‌లో ఉంచారు.
ఇది కూడా చదవండి : Women Wrestlers: బ్రిజ్ భూషణ్ కేసుల్లో ఏడుగురు మహిళా రెజ్లర్ల వాంగ్మూలాల నమోదు
మోడలింగ్ ఏజెన్సీ స్కూప్ మేనేజ్మెంట్ కూడా ఆమె మరణాన్ని ధృవీకరించింది. సియెన్నాఫొటోలను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.‘‘ఎప్పటికీ మన హృదయాల్లో’’ అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.2022 ఆస్ట్రేలియన్ మిస్ యూనివర్స్ పోటీలో 27 మంది ఫైనలిస్టులలో సియన్నా వీర్ ఒకరు. ఆమె సిడ్నీ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యం, మనస్తత్వశాస్త్రంలో డబుల్ డిగ్రీ చేశారు.
Updated Date - 2023-05-06T09:59:59+05:30 IST