ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది హిందూ-ముస్లింల ఐక్యతా నగరం.. అందరూ కలసి అన్ని పండుగలు చేసుకునే ఆ నగరంలో నేరాల రేటు ఎంతంటే...

ABN, First Publish Date - 2023-04-11T13:54:18+05:30

పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 875 కిలోమీటర్ల దూరంలోని తార్‌పార్కర్(Tharparkar) జిల్లాలో మిథి అనే నగరం ఉంది. భారతదేశం నుండి చూస్తే ఈ నగరం గుజరాత్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 875 కిలోమీటర్ల దూరంలోని తార్‌పార్కర్(Tharparkar) జిల్లాలో మిథి అనే నగరం ఉంది. భారతదేశం నుండి చూస్తే ఈ నగరం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌(Ahmedabad)కు 340 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మిథి నగరం హిందూ-ముస్లిం ఐక్యతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇక్కడి మొత్తం జనాభా(population) దాదాపు 87 వేలు, ఇందులో దాదాపు 80 శాతం మంది హిందువులు. ఈ ప్రాంతంలో ఏవైనా మతపరమైన పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు(Cultural events) జరిగినప్పుడు హిందువులు, ముస్లింలు భాగస్వాములవుతారు.

ఇక్కడ హిందూ-ముస్లింలు కలిసి దీపావళి(Diwali)తో పాటు ఈద్ ఉత్సవాన్ని కూడా జరుపుకుంటారు. హిందువులు మొహర్రం ఊరేగింపులో పాల్గొంటారు. అలాగే ముస్లింలతో పాటు ఉపవాసాలు(fasting) పాటిస్తారు. ఇక్కడి ముస్లింలు.. హిందూ మతాన్ని గౌరవిస్తూ గొడ్డు మాంసానికి దూరంగా ఉంటారు. కాగా పాకిస్తాన్‌(Pakistan)లోని ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ నేరాల రేటు చాలా తక్కువ. ఇక్కడ నేరాల రేటు కేవలం రెండు శాతం మాత్రమే అంటే ఎవరూ నమ్మలేరు.

అలాగే ఇక్కడ కనిపించే పరమత సహనం వేరెక్కడా కనిపించకపోవడం విశేషం. మిథిలో పలు దేవాలయాలు ఉన్నాయి, వాటిలో శ్రీ కృష్ణ దేవాలయం(Sri Krishna Temple) అత్యంత ప్రసిద్ధిచెందింది. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం(India-Pakistan war)లో భారత సైన్యం(Indian Army) మిథికి వచ్చారని, వారిని ఇక్కడి హిందువులు ఇక్కడే ఉండమని ఒప్పించారని చెబుతారు.

Updated Date - 2023-04-11T13:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising