ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Money Tips: వేలల్లో జీతం వస్తున్నా.. నెల తిరిగేసరికి అప్పులు చేయాల్సి వస్తోందా..? మీరు చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-06-29T16:29:27+05:30

పచ్చనోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుందని చెప్పారు సిరివెన్నెల గారు. డబ్బు లేకపోతే జీవితం ముందుకు సాగదు. కానీ వేలాది రూపాయలు సంపాదిస్తున్నా నెలాఖరుకు అప్పు చేయడం జరుగుతుంది. దానికి కారణం ఇదే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'రేయ్ ఓ రెండు వేలుంటే అడ్జెస్ట్ చేస్తావా.. శాలరీ అకౌంట్ లో యాడ్ అవ్వగానే నీకు రిటర్న్ ఇచ్చేస్తా' అని ఓ వ్యక్తి తన స్నేహితున్ని అడుగుతాడు. 'ఏమండీ పిన్నిగారు ఓ మూడువేలు ఉంటే సర్దుబాటు చేస్తారా..మా వారికి జీతం రాగానే ఇచ్చేస్తాను'అని ఓ ఇల్లాలు పక్కింటి పిన్నిని అడుగుతుంది. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు. ఆఫీసులో కొలీగ్స్ నుండి, ఇరుగు పొరుగు, స్నేహితులు, చుట్టాలు ఇలా అందరూ నెల తిరిగేసరికి అప్పుకోసం తంటాలు పడుతుంటారు. లేదంటే ఇంట్లో లోటు ఉందంటూ ఇబ్బందులు ఏకరువు పెడుతుంటారు. వేలల్లో జీతం తీసుకుంటున్నా మంత్ ఎండింగ్ వచ్చేసరికి చాలామంది పరిస్థితి ఇలాగే ఉంటుంది ఎందుకని? అసలు ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? డబ్బు విషయంలో చాలామంది చేస్తున్న బిగ్ మిస్టేక్ వల్లే ఇలా నెల ముగింపుకు వచ్చేసరికి ఇతరుల ముందు అప్పు కోసం చెయ్యి చాపేలా చేస్తోంది. ఇంతకూ ఆ పొరపాటు ఏంటి? వాటిని ఎలా సరిచేసుకోవాలి తెలుసుకుంటే..

పచ్చనోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుందని చెప్పారు సిరివెన్నెల గారు. నిజంగానే డబ్బు లేకపోతే జీవితం ముందుకు సాగదు సగటు మనిషికి. అయితే అవసరాలు తీర్చుకోవడానికి, అప్పులు చేయకుండా ఉండటానికి 'పొదుపు' చాలా గొప్ప పరిష్కారం. కానీ చాలామందికి పొదుపు చేసే మార్గం తెలియదు. పొదుపు చేయడానికి సింపుల్ మార్గాలున్నాయి(saving tips). ఇవి పాటిస్తే చక్కగా పొదుపు చేయవచ్చు.

ఖర్చులను ట్రాక్ చేయడం..(expenses tracking)

శాలరీ చేతికి రాగానే అందరికీ ఖర్చు పెట్టడమే తెలుసు. అయితే నెలవారీ దేనికి ఎంత ఖర్చుపెడుతున్నాం అనేది ట్రాక్ చేస్తే ఎక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చనేది కూడా అర్థమవుతుంది. ఇలాంటి ఖర్చులు తగ్గించుకుంటే నెల చివరి వరకు డబ్బును మెంటైన్ చేసుకోవచ్చు.

అత్యవసర నిధులు..(emergency funds)

అవసరాలు ఎవరికీ చెప్పి రావు. ఇలాంటి అవసరాలకోసం ఓ చిన్న నిధిని సమకూర్చుకోవడం ఎంతైనా అవసరం ఉంటుంది. ఎన్ని ఖర్చులున్నా నెలలో కొంత భాగాన్ని దాచిపెడుతూ ఉంటే ఎమర్జెన్జీ ఫండ్స్ గా అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది.

Belly Fat: కూర్చుని చేసే ఉద్యోగం.. బాన పొట్ట తగ్గదులే అని ఫిక్స్ అయిపోయారా..? ఈ 5 డ్రింక్స్‌ను తాగితే చాలు..!


బడ్జెట్ వేయచ్చు..(budget plan)

ప్రతి నెలా చేతికివచ్చే శాలరీకి అనుగుణంగా బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు. దీనివల్ల పొదుపు, ఖర్చులు పక్కాగా అమలవుతాయి. మంత్ ఎండింగ్ వరకు డబ్బుకు లోటు ఉండదు. అదనంగా ఏదైనా ఆర్థిక ఇబ్బంది వస్తే ఎలాగు ఎమర్జెన్సీ ఫండ్స్ చేతుల్లోనే ఉంటాయి.

అనవసర ఖర్చులు తగ్గిస్తే..(reduce unnecessary expenses)

బోలెడు డబ్బు పొదుపు చేయవచ్చు అనవసర ఖర్చులు తగ్గించుకుంటే. బయట ఎక్కువ తినే అలవాటున్నా, మొహమాటానికి పదే పదే పార్టీలు ఇచ్చే అలవాటున్నా, సందర్భం లేకుండా షాపింగ్ చేసే అలవాటున్నా, అవసరం లేకపోయినా ఓటిటి సబ్స్ఖ్రిప్షన్ లు తీసుకుంటున్నా.. ఇలా అనవసరంగా ఖర్చు చేస్తున్న దారులు చాలా ఉన్నాయి. వీటిని తగ్గించుకుంటే మంచి పొదుపరి అవ్వచ్చు.

Auto Driver Video: బెంగళూరులో ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా..? ఈ డ్రైవరన్న మాటలు వింటే..!


Updated Date - 2023-06-29T16:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising