ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Monkey Video: అరటికాయలు వేసేందుకు వెళ్తే.. అతడి కాళ్లకు అతుక్కుపోయిన కోతి.. ఎంతకూ వదలకపోవడంతో అతడేం చేశాడంటే..!

ABN, First Publish Date - 2023-10-05T09:46:12+05:30

మానవత్వం ఉన్న కొందరు మహానుభావుల కారణంగా అప్పుడప్పుడు అయినా కోతులు, కుక్కలు, పక్షులు మొదలైనవాటికి ఆహారం లభిస్తోంది. ఓ వ్యక్తి కోతులకు అరటిపండ్లు ఇస్తే ఓ కోతిపిల్ల చేసిన పనికి..

చెట్లను, అడవులను ఎడాపెడా నరికేస్తున్న కారణంగా కోతులకు ఆహారం దొరకడం కష్టమైపోతోంది. దీంతో ఇళ్లలోకి చొరబడుతుంటాయి. కొందరు మానవత్వం కలవారు, జంతుప్రేమికులు కోతులకే కాక ఆవులు, వీధి కుక్కలు, పక్షులకు ఆహారం ఇస్తుంటారు. ఓ వ్యక్తి అలాగే అరటిపండ్లు తీసుకెళ్ళి కోతులకు వేస్తుంటే ఓ కోతిపిల్ల అతని కాళ్లను చుట్టేసింది. ఎంత వదిలించుకుందామన్నా అది అతన్ని వదల్లేదు. దీంతో అతను చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మూగజీవులకు ఆహారం ఇవ్వడం(food donation to animals) ఎంతో గొప్ప పని. మానవత్వం ఉన్న కొందరు మహానుభావుల కారణంగా అప్పుడప్పుడు అయినా కోతులు, కుక్కలు, పక్షులు మొదలైనవాటికి ఆహారం లభిస్తోంది. జంతువులకు ఆహారం ఇచ్చేటప్పుడు చాలా వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఓ వ్యక్తికి అదే అనుభవం ఎదురైంది. వీడియోలో ఓ వ్యక్తి కారులో అరటిపండ్ల(banana's) బాస్కెట్లు పెట్టుకుని వచ్చి కోతులు(monkey's) ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అరటిపండ్లు వేస్తున్నాడు. అతనలా కోతులకు అరటిపండ్లు వేస్తుంటే ఒక కోతి పిల్ల(baby monkey) వచ్చి అమాంతంగా అతని కాలును చుట్టేసింది. అలాగని అది అతనికి ఎలాంటి హాని కలిగించలేదు. తన కాలును చుట్టేసిన కోతిపిల్లను విడదీసి పక్కకు వదిలేశాడు అతను. కానీ ఆ కోతిపిల్ల మళ్లీ వచ్చి అతని కాలును చుట్టేసింది. అదేదో అయస్కాంతం అతుక్కున్నట్టుగా దాన్ని ఎన్నిసార్లు విడదీసినా అది మళ్లీ వచ్చి చుట్టేస్తోంది. దీంతో ఏం చేయలేక అతను ఆ కోతిపిల్లను తన వెంట తీసుకెళ్లాడు. అతను కోతిపిల్లను కారులో తనతోపాటు తీసుకెళ్ళడం కూడా వీడియోలో చూడచ్చు. అతని మీద కూర్చున్న కోతిపిల్ల ఏమాత్రం అసౌకర్యానికి గురికాకుండా ఎలాంటి చింత లేకుండా ఉండటం అందరినీ కట్టిపడేస్తోంది.

Thyroid Problems: ఒక్క థైరాయిడ్ వల్ల మహిళల్లో ఏకంగా ఇన్ని సమస్యలా..? మెడిసిన్స్‌ వాడకుండానే పరిష్కార మార్గాలేంటంటే..!



ఈ వీడియోను desi mojito అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా సంతోషిస్తున్నారు. 'ఆ కోతిపిల్లకు అతనిలో తన తల్లిమనసు కనిపించి ఉంటుంది. అందుకే అది అతనితో వెళ్ళడానికి అలా చేసింది' అని ఒకరు కామెంట్ చేశారు. 'అతను చాలా సంతోషంగా ఉండాలి. మూగజీవులకు ఆహారం ఇవ్వడం చాలా గొప్పవిషయం' అని ఇంకొకరు అన్నారు. 'జంతువులకు కాస్త ఆహారం ఇస్తే చాలు, అవి చాలా నమ్మకంగా, ప్రేమగా ఉంటాయి' అని మరొకరు అన్నారు.

Vomit Sensation While Journey: ప్రయాణాల్లో ఉండగా అసలు వాంతులు ఎందుకొస్తాయి..? చిన్న పిల్లలకు ఈ సమస్య రాకుండా ఉండాలంటే..!


Updated Date - 2023-10-05T09:46:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising