Viral: సడన్‌గా ఇంటి ముందు 100 పార్శిల్స్.. ఆర్డర్ ఇవ్వకుండానే ఎలా వచ్చాయో తెలిసి అవాక్కైన మహిళ..!
ABN, First Publish Date - 2023-07-29T15:49:40+05:30
ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇంట్లోనే కూర్చుని తమకు అవసరమైన వస్తువులను నేరుగా రప్పించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు చాలా మెరుగ్గా, సమర్థవంతంగా ఆన్‌లైన్ డెలివరీలు చేస్తూ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్నాయి.
ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇంట్లోనే కూర్చుని తమకు అవసరమైన వస్తువులను నేరుగా రప్పించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అమేజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి సంస్థలు చాలా మెరుగ్గా, సమర్థవంతంగా ఆన్‌లైన్ డెలివరీలు చేస్తూ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్నాయి. అయితే అప్పుడప్పుడు మాత్రం పొరపాట్లు జరుగుతుంటాయి. ఓ మహిళ ఆర్డర్ చేయకుండానే ఆమె ఇంటికి ఏకంగా 100 పార్శిల్స్ వచ్చేశాయి. దీంతో ఆమె షాకైంది (Viral News).
వర్జీనియా (Virginia)కు చెందిన సిండి స్మిత్ అనే మహిళకు అకస్మాత్తుగా అమెజాన్ నుంచి చాలా పార్సెల్స్ వచ్చేశాయి. అవి దాదాపు వందకు పైగానే ఉన్నాయి. అయితే వాటిల్లో ఒకటి కూడా స్మిత్ ఆర్డర్ చేయలేదు. ఆ పార్శిల్స్‌లో 1,000 హెడ్‌ల్యాంప్‌లు, 800 గ్లూ గన్‌లు, డజన్ల కొద్దీ బైనాక్యులర్‌లు ఉన్నాయి. వాటిని తన పేరు మీద ఎవరు ఆర్డర్ చేస్తున్నారో తెలియక స్మిత్ తల పట్టుకుంటోంది. ప్యాకేజీలో సిండి స్మిత్ చిరునామా మాత్రమే ఉంది. కానీ, ఆర్డర్ చేసిన వ్యక్తి పేరు మాత్రం లిక్సియావో జాంగ్.
Viral: పెళ్లిలో వరుడికి కండిషన్లు.. వివాహ వేడుకలో అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకున్న వధువు స్నేహితులు!
ఆ లిక్సియావో జాంగ్ ఎవరో తెలియక స్మిత్ అయోమయానికి గురవుతోంది. స్మిత్ ఫిర్యాదు మేరకు అమేజాన్ సంస్థ విచారణ చేపట్టింది. అమేజాన్ సెంటర్లలో ఉండిపోయిన సరుకులను విక్రయదారు సేల్స్ చూపించుకోవడం కోసం ఇలా ఏదో ఒక అడ్రస్‌కు వాటిని పంపుతున్నాడని సిబ్బంది గుర్తించారు. వెంటనే తమ వెబ్‌సైట్ నుంచి ఆ విక్రయదారుడి అకౌంట్‌ను తొలగించారు.
Updated Date - 2023-07-29T15:49:40+05:30 IST