దోమలను చంపే మందులు మన ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-03-18T12:53:08+05:30
మస్కిటో కిల్లర్ లిక్విడ్(Mosquito killer liquid) లేదా కాయిల్ వినియోగం అనేక వ్యాధులను కలిగిస్తుంది. ఒక పరిశోధన(Research)లో మస్కిటో కాయిల్ 100 సిగరెట్‌లతో సమానమైన ప్రమాదకరమని తేలింది. ఈ లిక్విడ్ ఆరోగ్యానికి ఏ విధంగా హాని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మస్కిటో కిల్లర్ లిక్విడ్(Mosquito killer liquid) లేదా కాయిల్ వినియోగం అనేక వ్యాధులను కలిగిస్తుంది. ఒక పరిశోధన(Research)లో మస్కిటో కాయిల్ 100 సిగరెట్‌లతో సమానమైన ప్రమాదకరమని తేలింది. ఈ లిక్విడ్ ఆరోగ్యానికి ఏ విధంగా హాని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దోమలను చంపే లిక్విడ్‌లో విషపూరిత రసాయనాలు(Toxic chemicals) ఉన్నాయి. ఇవి శ్వాసతో పాటు లోపలికి వెళ్లి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి.
మస్కిటో కిల్లర్ లిక్విడ్‌లో అలెథ్రిన్, ఏరోసోల్ మిశ్రమం(Aerosol mixture) ఉంటుంది. బాటిల్‌లో కార్బన్ ఎలక్ట్రోడ్ రాడ్ ఉంటుంది. ఫిలమెంట్ వేడిగా ఉన్నప్పుడు, ఎలక్ట్రోడ్ రాడ్(Electrode rod) ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని తరువాత అది వేడెక్కుతుంది. దాని నుంచి వచ్చే గాలి శ్వాస ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా గొంతు నొప్పి, తలనొప్పి(headache) వస్తాయి. దాని నుండి వెలువడే పొగ శరీరంలోని ఊపిరితిత్తులను(lungs) దెబ్బతీస్తుంది. అందుకే మస్కిటో కిల్లర్‌ను తక్కువగా వాడాలని వైద్యులు సూచిస్తుంటారు.
ముఖ్యంగా చిన్న పిల్లలకు దోమతెర(mosquito net)లను వాడటం ఉత్తమమని చెబుతుంటారు. కొంతమంది దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరానికి క్రీమ్ రాసుకుంటారు. ఈ క్రీమ్ దోమల నుండి మనలను కాపాడినప్పటికీ చర్మంపై దుష్ప్రభావాలను(side effects) కలిగిస్తుంది. దోమలను వదిలించుకోవడానికి అప్లై చేసే ఈ క్రీమ్ చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రీమ్‌లో ఉండే రసాయనాలు మన చర్మంపై ఇన్ఫెక్షన్(infection)ను కలిగిస్తాయి.
Updated Date - 2023-03-18T12:53:08+05:30 IST