ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

love marriages: విడాకులకు ప్రేమ పెళ్ళళ్ళే కారణమా..!

ABN, First Publish Date - 2023-05-18T15:50:51+05:30

విడాకుల అనంతరం కుంగిపోవడమో, లేక మరో జీవితాన్ని ఆశించకపోవడమో చేయడం లేదు.

6-month waiting period
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ పెళ్ళిళ్ళు విజయవంతంగా ముందుకు సాగిపోవాలంటే దానికి ఇద్దరి మధ్యా సరైన అవగాహన అవసరం. ఒకిరిమీద ఒకరికి నమ్మకం, కావాలి. ప్రేమ పెళ్ళిళ్ళు చాలావరకూ విఫలమవుతున్నాయంటూ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో... అసలు ఇందులో ఎంత నిజమున్నదనేది విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

ఏ వివాహాలయినప్పటికీ, విడాకుల దాకా వెళ్ళడానికి సరైన అవగాహన లేకపోవడమే కారణం కావచ్చని చెప్పవచ్చు. కేవలం ప్రేమ పెళ్ళిళ్ళే కాదు. మనం పూర్వపు తరాలని గమనించినట్లయితే ఆరోజుల్లో కుటుంబ సాంప్రదాయాలు, చుట్టరికాలంటూ బలవంతంగా పెళ్ళిళ్ళు చేసేవారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళన్నీ విజయవంతం అవుతున్నాయనీ లేదు. అవి విడాకుల దారి పట్టడం లేదనీ కాదు. అతని గురించి ఆమెకు, ఆమె గురించి అతనికి తెలిసేదీ తక్కువే. ఒకటి ఏమిటంటే పెద్దల సమక్షంలో కలిసిన జీవితాలు మూడుముళ్ళతో ఏకం అయ్యి, తల్లిదండ్రుల చాటున సంసారాలు సాగుతాయేకానీ, నాలుగు గోడలమధ్య ఆలుమగల అంతరంగిక జీవితాల్లో పెద్దలు కలగజేసుకునే అవకాశం ఉండదు.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోండి..రిజల్ట్ కి ఆశ్చర్యపోవడం ఖాయం..!

సమస్యలు, పొరపొచ్చాలు అనేవి ఇద్దరి మధ్యా వచ్చే అవకాశమూ లేకపోలేదు. పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు ఒక వ్యక్తిని చూసి పెళ్ళిచేసుకోమంటే ఆడపిల్లలు దానికి తలవంచేవారు. అతనితోడిదే జీవితంగా కష్టనష్టాలను అనుభవించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ప్రేమ వివాహమైన, పెద్దలు కుదిర్చిన పెళ్ళయినా అభిప్రాయాలు కలవకపోతే అమ్మాయిలు, అబ్బాయిలు నిరభ్యంతరంగా విడాకులు తీసుకుంటున్నారు.

విడాకుల అనంతరం కుంగిపోవడమో, లేక మరో జీవితాన్ని ఆశించకపోవడమో చేయడం లేదు. ఇప్పటి యువత రెండో పెళ్ళి విషయంలో కూడా చక్కని నిర్ణయాలను తీసుకుని జీవితంలో నిలదొక్కుకుంటున్నారు. జీవితాల్లో వచ్చే కుదుపులకు కుంగిపోకుండా ఎదిరించి నిలుస్తున్నారు. ఒకప్పటితో పోల్చితే ఆడైనా, మగైనా జీవితంలో నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకుంటున్నారు.

Updated Date - 2023-05-18T15:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising