ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రైలు బయలు దేరితే.. ‘రాజధాని’ అయినా, ‘శతాబ్ధి’ అయినా.. చివరకు వందే భారత్ అయినా దారి ఇవ్వాల్సిందే.. ఆ స్పెషల్ ట్రైన్ ఏదో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-05-02T12:12:40+05:30

భారతదేశంలోని టాప్ కేటగిరీ రైళ్లలో రాజధాని(rajadhani), శతాబ్ది వస్తాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఈ కేటగిరీలో చేరింది. రైల్వేశాఖ(Department of Railways) రైళ్ల రాకపోకల విషయంలో రాజధాని రైళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతదేశంలోని టాప్ కేటగిరీ రైళ్లలో రాజధాని(rajadhani), శతాబ్ది వస్తాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఈ కేటగిరీలో చేరింది. రైల్వేశాఖ(Department of Railways) రైళ్ల రాకపోకల విషయంలో రాజధాని రైళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నడిచే కొన్ని రైళ్లు ట్రాక్‌పైకి వచ్చినప్పుడు, రాజధానిని ఆపి, వాటని ముందుగా వెళ్లడానికి అనుమతిస్తారు. ప్రమాదాలు(Accidents) జరిగినప్పుడు ప్రమాద స్థలానికి వైద్య సహాయం అందించేందుకు ఇటువంటి రైళ్లను నడుపుతారు.

రైల్వేశాఖలో అన్ని రైళ్ల కంటే ఈ రైలుకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. రాజధాని, శతాబ్ది(satabdhi) మొదలైన రైళ్లు కూడా వాటికన్నా ముందు ఉంటే, అప్పుడు వాటిని ఆపివేసి, ముందుగా ఇటువంటి రైళ్లకు దారి ఇస్తారు. ఈ కోవలోని ARME అనేది భారతీయ రైల్వేలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రైలు. ఇదేవిధంగా దేశ రాష్రపతి(President of the country) రైలుకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు.

అయితే ఇప్పుడు రాష్ట్రపతి అధికంగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ రైలు ఆపరేషన్ చాలా అరుదుగా జరుగుతోంది. కాగా మామూలు రోజుల్లో నడిచే హై ప్రయారిటీ రైళ్ల(High priority trains) విషయానికి వస్తే రాజధాని ఎక్స్‌ప్రెస్ పేరు అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ రైలు సరైన సమయానికి చేరుకుంటుంది. దానిలో అనేక సౌకర్యాలు కూడా ఉంటాయి. దీని తర్వాత ఈ జాబితాలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్(Shatabdi Express) రైలు నంబర్ వస్తుంది.

దీనిని భారతదేశంలోని సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఒకటిగా పరిగణిస్తారు. ఆ తరువాత దురంతో ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ అధిక ప్రాధాన్యత గల రైళ్ల జాబితాలోకి వస్తాయి. గరీబ్ రథ్(Garib Rath) రైలు ప్రాధాన్యతా క్రమంలో ఏడవ స్థానంలో ఉంది.

Updated Date - 2023-05-02T12:39:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising