దేశంలో గ్యాంగ్ స్టర్స్ హవా... దావూద్ నుంచి అతీక్ అహ్మద్ వరకూ.. ఎవరెవరు ఎంతటి దారుణాలకు పాల్పడ్డారో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-04-17T11:26:03+05:30
ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్(atiq-ahmed), అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ల హత్య.. దేశంలో పెను సంచలనం సృష్టించింది. అతీక్ ఆహ్మద్.. గ్యాంగ్‌స్టర్ కమ్ పొలిటీషియన్(Gangster cum politician)గా పేరుగాంచాడు.
ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్(atiq-ahmed), అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ల హత్య.. దేశంలో పెను సంచలనం సృష్టించింది. అతీక్ ఆహ్మద్.. గ్యాంగ్‌స్టర్ కమ్ పొలిటీషియన్(Gangster cum politician)గా పేరుగాంచాడు. వైద్య పరీక్షల కోసం పోలీసులు ఆయనను ఆసుపత్రికి తీసుకురాగా.. ముగ్గురు వ్యక్తులు కాల్పులు(firing) జరిపి అతిక్‌ను హతం చేశారు. అంతకు రెండ్రోజుల ముందే అతిక్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
పదో తరగతి ఫెయిల్ అయిన అతీక్ 17 ఏళ్ల వయసులోనే చెడు సావాసాల బాట పట్టాడు. అత్యధిక డబ్బు సంపాదించాలనే ఆశతో 1979లోనే దొంగతనాలు(thefts), కిడ్నాప్ చేయడం, దోపిడీలు చేయడం మొదలుపెట్టాడు. అదే ఏడాది తొలిసారిగా అతనిపై హత్య కేసు నమోదైంది. అది మొదలు అతని నేరాలకు అడ్డే లేకుండా పోయింది. 1989లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశాడు. తాజాగా అతని హత్య అనంతరం దేశంలోని అత్యంత భయంకరమైన గాంగ్‌స్టర్ల(Gangsters) గురించి చర్చసాగుతోంది.
20వ శతాబ్దపు ద్వితీయార్ధం నుండి గ్యాంగ్‌స్టర్లు భారత్‌లో అండర్ వరల్డ్‌ను ఏలుతున్నారు. 1940 నుంచి 80ల మధ్యకాలంలో ముంబైలో కరీమ లాలా(Karima Lala), అతని కుటుంబం, హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియార్ ఆధిపత్యం చెలాయించారు. 80వ దశకంలో భారతదేశంలో పేరొందిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim), అతని సహచరులు విడిపోయిన తర్వాత ఎవరికివారు వారి సొంత ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశానికి చెందిన అత్యంత భయంకరమైన 10 మంది గ్యాంగ్‌స్టర్ల(Gangsters) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. దావూద్ ఇబ్రహీం
భారతదేశంలోని అత్యంత భయంకరమైన గ్యాంగ్‌స్టర్ల ప్రస్తావన వచ్చినప్పుడు దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) ఈ జాబితాలో అగ్రస్థానంలో కనిపిస్తాడు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులలో దావూద్ ఇబ్రహీం పాల్గొన్నాడు, 1993 ముంబై బాంబు పేలుళ్ల వెనుక సూత్రధారి కూడా ఇతనే. గతంలో దావూద్ కరాచీలో నివసిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం దానిని ఖండించింది. అనురాగ్ కశ్యప్ రూపొందించిన బాలీవుడ్ చిత్రం ‘బ్లాక్ ఫ్రైడే‘లో అతని దోపిడీలను నాటకీయంగా చూపించారు.
2. టైగర్ మెమన్(Tiger Memon)
1993 ముంబై బాంబు పేలుళ్ల వెనుక ప్రధాన నిందితుల్లో టైగర్ మెమన్ ఒకడు. అతను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ డి-కంపెనీ సభ్యుడు. ఉగ్రవాద చర్యలకు కుట్రపన్నడం, ప్రోత్సహించడం తదితర ఆరోపణల రీత్యా దోషిగా ఉన్న టైగర్ మెమన్‌ను ఇంటర్‌పోల్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తమకు అప్పగించాలని కోరుతోంది. ముంబై వరుస పేలుళ్ల అనంతరం టైగర్ మెమన్ పాకిస్తాన్‌కు పారిపోయి కరాచీలోని గుల్షన్-ఎ-ఇక్బాల్‌లో నివసించాడని సమాచారం.
3. ఛోటా రాజన్
ఇతను దావూద్ ఇబ్రహీం మాజీ సహచరుడు. 1988లో దావూద్ ఇబ్రహీం దేశం విడిచి పారిపోయిన తర్వాత, ఛోటారాజన్ అతనికి ప్రత్యర్థిగా మారాడు. 17 హత్యలు, లెక్కలేనన్ని హత్యాయత్నాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీల ఆరోపణలు.. మొదలైనవన్నీ ఛోటా రాజన్‌ను(Chhota Rajan) భారతదేశంలోని అత్యంత భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌లలో ఒకడిగా మార్చాయి. 1999లో సంజయ్ దత్ నటించిన ‘వాస్తవ్: ది రియాలిటీ’ చిత్రం రాజన్ జీవితం ఆధారంగా రూపొందింది.
4. బడా రాజన్
దావూద్ గ్యాంగ్‌లో చేరడానికి ముందు, ఛోటా రాజన్.. బడా రాజన్ కు ముఖ్య సహచరుడు. దావూద్ ఇబ్రహీంను ముంబై క్రైమ్ లార్డ్‌గా నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతని నేరాలలో.. సినిమా టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్(Black marketing) చేయడం, తద్వారా లెక్కలేనంత డబ్బు సంపాదించడం మొదలైనవి ఉన్నాయి. అతని జీవితం ఆధారంగా 1991లో మలయాళంలో ఒక చిత్రం రూపొందించారు.
5. రవి పూజారి
రవి పూజారి ఛోటా రాజన్‌తో కలిసి పనిచేశాడు. అతను సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, ఫరా ఖాన్, షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)తో సహా పలువురు ప్రముఖులను బెదిరించాడు. రవి పూజారి ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నాడు.
6. అబూ సలేం
దావూద్ ఇబ్రహీంతో కలిసి 1993 ముంబై బాంబు పేలుళ్లలో సలేం చురుకుగా పాల్గొన్నాడు. మనిషా కొయిరాలా(Manisha Koirala) వ్యక్తిగత సహాయకుడిని హత్య చేయడం, అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్ రాకేష్ రోషన్‌లను బెదిరించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అబూ సలేం.. టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్(Gulshan Kumar) హత్యతో పాటు అనేక ఇతర నేరాలకు పాల్పడ్డాడు, అబూ సలేం ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు.
7. వరదరాజన్ ముదలియార్
ముంబైలోని ప్రముఖ మాఫియా ముఠాలోని ముగ్గురిలో ఇతను ఒకడు. మిగిలిన ఇద్దరు హాజీ మస్తాన్, కరీం లాలా. దోపిడీ, కిడ్నాప్, కాంట్రాక్ట్ హత్యలు, భూ ఆక్రమణ, అక్రమ జూదం, మద్యం డెన్‌లు, అక్రమ మద్యం తయారీ(Illegal manufacture of liquor) మొదలైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వరదరాజన్ జీవితంపై పలు సినిమాలు వచ్చాయి, మణరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘నాయకన్‘ (1987) ఇతని జీవితం ఆధారంగా వచ్చిన సినిమా.
8. వీరప్పన్
తమిళనాడుకు చెందిన గ్యాంగ్‌స్టర్‌లలో ఒకడైన వీరప్పన్(Veerappan) 184 మందిని హత్య చేశాడని, 2000కు మించిన ఏనుగులను వేటాడాడని, ₹16 కోట్ల విలువైన దంతాలు, సుమారు 65 వేల కిలోగ్రాముల గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేశాడనే ఆరోపణలున్నాయి. తమిళనాడు(Tamil Nadu)లోని పప్పరపట్టిలో జరిగిన కాల్పుల్లో వీరప్పన్ హతమయ్యాడు. వీరప్పన్ జీవితం, ముఖ్యంగా అతడిని పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను రామ్ గోపాల్ వర్మ తన ‘వీరప్పన్’ (2016) సినిమాలో చూపించారు.
9. హసీనా పార్కర్
హసీనా పార్కర్(Haseena Parker) దావూద్ ఇబ్రహీం సోదరి. దావూద్ ఇబ్రహీం దేశం విడిచి పారిపోయినప్పుడు, ముంబైలోని అతని అక్రమ వ్యాపారాలన్నింటినీ నిర్వహించే బాధ్యత ఆమెపై పడింది. శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘హసీనా పార్కర్’ చిత్రం 2017లో విడుదలైంది.
10. అర్చన బాల్ముకుంద్ శర్మ
బబ్లూ శ్రీవాస్తవ గ్యాంగ్‌లో ఈమె సభ్యురాలు. అర్చన బాల్ముకుంద్ శర్మ(Archana Balmukund Sharma)పై పలు కిడ్నాప్‌లు, దోపిడీ కేసులు ఉన్నాయి. ఇప్పటికీ ఆమె ఆచూకీ తెలియరాలేదు.
Updated Date - 2023-04-17T11:47:12+05:30 IST