ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kondagattu Forest: అడవిలో చెట్లు ఉంటాయిగా దత్తత తీసుకోవడం ఎందుకు?.. ఎంపీ సంతోష్‌పై సెటైర్లు

ABN, First Publish Date - 2023-02-17T18:22:57+05:30

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ (Green India challenge) కార్యక్రమం ద్వారా బీఎస్ఆర్ ఎంపీ సంతోష్ కుమార్ మంచి పేరు పొందారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ (Green India challenge) కార్యక్రమం ద్వారా బీఎస్ఆర్ ఎంపీ సంతోష్ కుమార్ మంచి పేరు పొందారు. సినీ సెలబ్రిటీల నుంచి క్రీడాకారులు, రాజకీయ నాయకుల వరకు చాలా మందికి ఛాలెంజ్ విసిరి మొక్కలు నాటించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు మాత్రమే ఇతర రాష్ట్రాల ప్రముఖలు కూడా ఇందులో పాల్గొన్నారు. దీంతో ఎంపీ సంతోష్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఒకానొక సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా స్వయంగా మెచ్చుకున్నారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఒక అద్భుతమైన కార్యక్రమమ‌ని, పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ వ్యాప్తంగా స్ఫురింపజేయడం అభినందనీయమ‌ని పొగిడారు. అయితే ఏకంగా ప్రధానమంత్రి ప్రశంసలు అందుకున్న ఎంపీ సంతోష్.. ఇప్పుడు కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకోవడం విమర్శలపాలవుతోంది. ఫారెస్ట్‌ను దత్తత తీసుకోవడం మంచి పనే అయినా ఎందుకు విమర్శలు ఎదుర్కొంటున్నారో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు25 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో తొలిసారి కొంగట్టు అంజన్నను గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునరుద్ధరణకు గతంలో ప్రకటించిన రూ.100 కోట్లకు మరో రూ.500 అదనంగా ప్రకటించారు. కేసీఆర్ నిర్ణయం పట్ల ఎంపీ సంతోష హర్షం వ్యక్తం చేశారు. ‘‘ కొండగట్టు పునరుద్ధరణకు కేసీఆర్ రూ.600 కోట్లు ప్రకటించారు. గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో భాగంగా 1095 ఎకరాల కొడిమ్యాల్ రిజర్స్ ఫారెస్ట్‌ను దత్తతు తీసుకోవడం తగినదని భావిస్తున్నాను. దిగ్గజ రాజకీయనేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా’’ అంటూ సంతోష్ ట్వీట్ చేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే అడవిని దత్తత తీసుకోవడమేంటి?. అడవిలో చెట్లు నాటడం ఏంటి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాలో ఎంపీ సంతోష్‌పై సెటైర్లు పడుతున్నాయి. విక్కీ గౌడ్ అనే ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. ‘‘ అడవిని దత్తతకు తీసుకొని చెట్లు నాటుడు ఏంది ఎంపీ గారు. అడవి అంటే ఎడారి లెక్క వుండదు. గుబురు దట్టమైన చెట్లు ఉన్నదాన్నే అడవి అంటారు. మళ్ళా అందులో నువ్వు చెట్లు పెట్టుడు ఏంది?. సముద్రంలో నీళ్ళు పోసినట్టు. నాకు అర్థం కాదు. ప్రభుత్వం పైసలు అడవుల పాలు చేస్తున్నారు కదా ఎంపీ గారు’’ అంటూ పేర్కొన్నారు. కొండగట్టు అడవులలో చెట్లు నాటుడు కాదని, గతంలో కొండగట్టు రోడ్డు ప్రమాదంలో చాలా మంది చనిపోయారని, ముందు వారి కుటుంబాలను అదుకోవాలని మరో వ్యక్తి కోరారు. మరో నెటిజన్ ఒక్క అడుగు ముందుకేసి అడవిల గంజాయి మొక్కలు పెంచుతారేమో అని సెటైర్లు వేశారు. ఈ వ్యంగ్యాస్త్రాలపై ఎంపీ సంతోష్ స్పందించి.. అడవిని దత్తత తీసుకోవడానికి గల కారణాలను వెల్లడిస్తారో లేదో వేచిచూడాలి మరి.

Updated Date - 2023-02-17T18:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising