ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: రాత్రులు వేస్టైపోతున్నాయి.. పెళ్లి చేయండి.. జిల్లా యంత్రాంగానికి ఓ ప్రభుత్వ టీచర్ లేఖ..చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-11-04T16:58:28+05:30

ఎన్నికల విధులకు ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు తింగరి సమాధానం ఇచ్చిన ఓ టీచర్‌పై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది.

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల విధులకు ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు తింగరి సమాధానం ఇచ్చిన ఓ టీచర్‌పై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది. మధ్యప్రదేశ్‌లో(Madhyapradesh) సత్నా జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. అఖిలేశ్ కుమార్ తివారీ అనే టీచర్ జిల్లాలోని అమర్‌పటాన్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. అతడికి 35 ఏళ్లు వచ్చినా ఎందుకో ఇంకా పెళ్లికాలేదు. మరోవైపు, రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు మొదలు కానుండటంతో పోలింగ్ విధులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలకు(Poll Training) హాజరు కావాలంటూ జిల్లా యంత్రాంగం అతడిని ఆదేశించింది. కానీ అఖిలేశ్ మాత్రం శిక్షణ తరగతులు ఎగ్గొట్టడంతో కారణం చెప్పాలంటూ జిల్లా యంత్రాంగం అతడికి నోటీసులు(Show cause notice) జారీ చేసింది.

Hacking: మీ స్మార్ట్ ఫోన్ హ్యాకైందని డౌటా? ఇలా చేస్తే కేవలం 30 సెకెన్లలోనే..

Viral: విదేశీ టూర్లలో ఈ తప్పు అస్సలు చేయకండి! దానిమ్మ జ్యూస్ ఆర్డరిచ్చిన యువకుడిని ఎందుకు అరెస్టు చేశారంటే..


అధికారిక నోటీసులకు జాగ్రత్తగా సమాధానమివ్వాల్సిన అఖిలేశ్ ఓ అసాధారణ లేఖ ప్రభుత్వానికి పంపించాడు. భార్య లేక తన జీవితం వ్యర్థమైపోతోందంటూ లేఖలో పేర్కొన్నారు(MP Teacher Asks Govt to Get Him Married Before Poll Training). ‘‘నా లైఫంతా వైఫ్ లేకుండా వృథా అయిపోతోంది. రాత్రుళ్లు అన్నీ వృథా అయిపోతున్నాయి. ముందు నాకు పెళ్లి చేయండి. ఆ తరువాత ఎన్నికల విధుల గురించి మాట్లాడండి’’ పాయింటు టూ పాయింట్‌గా అధికారులు అడిగన ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకుంటూ పోయాడు. ‘‘నాకు మూడున్నర లక్షల రూపాయల కట్నం కావాలి. నగదు రూపంలో ఇచ్చినా లేక బ్యాంకు అకౌంట్లో నేరుగా బదిలీ చేసినా పర్లేదు. సింగ్రౌలీ టవర్ లేదా రేవా జిల్లాలోని సమ్దారియాలో ఓ ఫ్లాట్ కొనుక్కునేందుకు లోన్ శాంక్షన్ చేయించండి’’ అని తన లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు, తనకు చేయి విరిగిందని, వెన్నెముక సమస్యలు కూడా ఉన్నాయని వాపోయాడు. ‘‘అన్నీ తెలిసున్న మీరు ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో చెప్పండి?’’ అంటూ ముగించాడు.

Viral Video: నవ్వుతూనే ఈ పిల్లాడు చెప్పిన మాటలు విని కన్నీళ్లు రావడం ఖాయం.. కారులో కూర్చున్న ఓ యువతి మనసు కరిగిపోయి..!

ఎలాంటి రెస్పాన్స్ ఆశించి అఖిలేశ్ ఈ లేఖ రాశాడో తెలీదు కానీ అధికారులకు మాత్రం ఒళ్లు మండిపోయింది. దీంతో, అతడిని సస్పెండ్(Suspension) చేస్తూ జిల్లా కలెక్టర్ అనురాగ్ వర్మ్ నవంబర్ 2న ఆదేశాలు జారీ చేశారు. అతడిని మాఝాగావ్‌లోని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయానికి అటాచ్ చేశారు.

Viral Video: వారెవ్వా.. ఏం టెక్నిక్ గురూ.. ఇలాంటి టీచర్లు ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవడం ఖాయం..!

Shocking: మిల్క్‌షేక్‌ను ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి షాకింగ్ అనుభవం.. ఆ కప్పు నిండా ఏం నింపి పంపారో తెలిస్తే..!

Updated Date - 2023-11-04T17:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising