ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Madhya Pradesh: నేను తల్లిని కావాలనుకుంటున్నా.. నా భర్తను వదలండి.. మధ్యప్రదేశ్ హైకోర్టులో ఓ మహిళ పిటీషన్!

ABN, First Publish Date - 2023-11-03T16:13:38+05:30

తాను బిడ్డను కనాలనుకుంటున్నానని, వెంటనే తన భర్తను జైలు నుంచి బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ ఓ మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టులో ఓ పిటీషన్ వేసింది. సంతానం పొందడం తన ప్రాథమిక హక్కు అని ఆమె తన పిటీషన్‌లో పేర్కొంది. ఈ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు..

తాను బిడ్డను (Child) కనాలనుకుంటున్నానని, వెంటనే తన భర్తను (Husband) జైలు (Jail) నుంచి బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ ఓ మహిళ మధ్యప్రదేశ్ (Madhya Pradesh) హైకోర్టులో ఓ పిటీషన్ వేసింది. సంతానం పొందడం తన ప్రాథమిక హక్కు అని ఆమె తన పిటీషన్‌లో పేర్కొంది. ఈ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు (Madhya Pradesh High Court).. ఆ మహిళ గర్భం దాల్చడానికి తగినంత ఆరోగ్యంగా ఉందో, లేదో తేల్చాలని కోరూతూ ఐదుగురు వైద్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

పిటిషనర్ భర్త ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలాడు. కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. అయితే అతడి భార్య బిడ్డను కనడం కోసం భర్తను విడుదల చేయాలని కోరుతోంది. గతంలో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సంతానోత్పత్తి తన ప్రాథమిక హక్కు అని ఆమె క్లెయిమ్ చేసింది. తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని కోరింది. అయితే రికార్డుల ప్రకారం సదరు మహిళలో రుతుక్రమం ఆగిపోయిందని, అందువల్ల ఆమె సహజంగా లేదా కృత్రిమ గర్భధారణ ద్వారా గర్భం దాల్చే అవకాశం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు.

Viral: చంద్రుడు వెళ్లిపోయేలా ఉన్నాడు.. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వ్యక్తి నుంచి పోలీసులకు ఫోన్.. చివరకు ఏం జరిగిందంటే..

ఈ పిటీషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తాజాగా ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ మహిల గర్భం దాల్చే వీలుందో, లేదో పరీక్షించడం కోసం ఐదుగురు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని జబల్‌పూర్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ డీన్‌ను ఆదేశించింది. ముగ్గురు గైనకాలజిస్టులు, ఒక సైకియాట్రిస్ట్ మరియు మరొక ఎండోక్రినాలజిస్ట్‌తో కూడిన బృందం ముందు ఈ నెల ఏడో తేదన ఆ మహిళ హాజరు కావాల్సి ఉంది. 15 రోజుల్లోగా ఆ బృందం తమ నివేదికను సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Updated Date - 2023-11-03T16:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising