ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రైల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య అకస్మాత్తుగా గొడవ.. సీన్‌లోకి మరో ప్రయాణికుడి ఎంట్రీతో..

ABN, First Publish Date - 2023-09-02T18:54:12+05:30

ముంబై ట్రెయిన్‌లో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవను చిటికలో సద్దుమణిగేలా చేసిన ఓ వ్యక్తిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: నేటి బిజీ లైఫ్‌లో ఎవరి గోల వారిది. పక్కోడు ప్రమాదంలో పడ్డా పట్టించుకునే వారే లేని కాలం వచ్చి పడింది. కారణాలు అనేకం. అనవసర వివాదాల్లోకి తలదూర్చొద్దని కొందరు అనుకుంటారు. మనకెందుకులే రిస్క్ అని ఇంకొందరు ఫీలవుతారు. ఎవరేమైపోయినా తమకేమీ పట్టనట్టు గడిపేస్తుంటారు ఇంకొందరు. అందుకే, కొన్నిసార్లు చిన్న చిన్న గొడవుల కూడా భారీ వివాదాలుగా మారుతుంటాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే దాకా వెళుతుంటాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు, రైళ్లు, మెట్రోల్లో ఇటువంటి దృశ్యాలు కామన్. అయితే, ఇటీవల ముంబై లోకల్ రైల్లో ఇద్దరు ప్రయాణికుల గొడవ కూడా ఇలాగే మొదలైంది(Two men fight in Mumbai Local train). కానీ ఆ తరువాతే అసలు ట్విస్ట్ వచ్చింది.


ప్రయాణికుల మధ్య గొడవకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తొలుత ఆ ఇద్దరి మధ్య అకస్మాత్తుగా గొడవ మొదలైంది. చూస్తుండగానే వారు పరస్పర దాడులకు దిగారు. మిగతా వారంతా మౌనప్రేక్షకులుగా మారిపోయారు. జరగబోయేది చూడటం మినహా కల్పించుకునే సాహసమే చేయలేదు. ఇంతలో మరో ప్రయాణికుడు సీన్‌లోని ధైర్యంగా ఎంట్రీ ఇచ్చారు. కలబడి కొట్టుకోబోతున్న ఇద్దరినీ దూరంగా జరిపి వారికి నచ్చ చెప్పడం ప్రారంభించారు. కోపంలో ఉన్న వారిద్దరూ మళ్లీ కలబడేందుకు ప్రయత్నించినా అతడు పడనీయలేదు. వారిద్దరూ శాంతించే వరకూ ఇద్దరి మధ్యా అడ్డుగా నిలిచాడు. వారిని చేతులతో ఆపుతూ గొడవ ముదరకుండా చొరవ చూపాడు(Third passenger pacifies the situation). వారి కోపం చల్లారడంతో ఈ వివాదం టీకప్పులో తుపానులా క్షణాల్లో చల్లబడిపోయింది.


ఈ ఉదంతంలో ఆ వ్యక్తి చూపిన చొరవకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇలాంటోళ్లు ఉంటే ప్రపంచంలో శాంతిసామరస్యాలు వెల్లివిరుస్తాయంటూ ప్రశంసించారు. పక్కోడి పొడే గిట్టని వారున్న ప్రపంచంలో తనకే ఉపయోగం లేకపోయినా ఇద్దరి తగదా తీర్చేందుకు మధ్యవర్తిత్వం నెరిపిన అతడి ధైర్యసాహసాలను కూడా మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియో(Viral video) మీరూ చూడండి!

Updated Date - 2023-09-02T19:01:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising