ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఐఫోన్ పోయింది.. కానీ, మానవత్వం దొరికింది.. పోగొట్టుకున్న మొబైల్ ఆ మహిళకు ఎలా దొరికిందంటే..

ABN, First Publish Date - 2023-07-05T16:05:17+05:30

ప్రస్తుత రోజుల్లో ఒకసారి ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే దానిని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. ముఖ్యంగా ఖరీదైన మొబైల్స్ పోగొట్టుకుంటే వాటి గురించి వెతకడం కూడా అనవసరం. ఎవరికి దొరికినా తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదు. వెంటనే సిమ్ మార్చేసి వారు వాడేసుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత రోజుల్లో ఒకసారి ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే దానిని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. ముఖ్యంగా ఖరీదైన మొబైల్స్ (Mobile) పోగొట్టుకుంటే వాటి గురించి వెతకడం కూడా అనవసరం. ఎవరికి దొరికినా తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదు. వెంటనే సిమ్ మార్చేసి వారు వాడేసుకుంటారు. అందులోనూ దేశంలోని మెట్రో నగరాల్లో అయితే మొబైల్ దొరకడం మరీ కష్టం. కానీ, ముంబై (Mumbai)కి చెందిన ఓ మహిళ పోయిన తన ఖరీదైన ఐఫోన్‌ను తిరిగి పొందింది. అది ఎలా జరిగిందో ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ముంబైకి చెందిన ఓ మహిళ రోజూ వెర్సోవా స్టేషన్ నుంచి ఉద్యోగానికి వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె రెండ్రోజుల క్రితం ఖరీదైన ఐఫోన్ 12 (Iphone 12)ను పోగొట్టుకుంది. ఆటో దిగి స్టేషన్ మెట్లు ఎక్కుతుండగా ఆమె తన ఫోన్ పోయిన విషయాన్ని గ్రహించింది. వెంటనే ఆటో స్టాండ్‌కు పరిగెత్తుకెళ్లి తన ఎక్కిన ఆటో అంతా వెతికింది. ఎక్కడా ఆమె ఫోన్ ఆచూకీ దొరకలేదు. విషయం తెలుసుకున్న ఆటో స్టాండ్‌లోని డ్రైవర్లంతా (Mumbai Auto Drivers) ఆమె మొబైల్ నెంబర్‌కు ఫోన్లు చేశారు. మొబైల్ రింగ్ అవుతున్నా చాలా సేపటి వరకు ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె తన మరో నెంబర్‌ను ఆటో డ్రైవర్‌కు ఇచ్చి నిరాశగా వెళ్లిపోయింది.

Viral: వీళ్లేం మనుషులండీ బాబూ.. డెలివరీ కోసం భార్యను తీసుకెళ్తే.. ఆస్పత్రి ముందే అల్లుడితో గొడవ.. చివరకు..!

కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఆటో డ్రైవర్ నుంచి కాల్ వచ్చింది. డీఎన్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ (Swiggy delivery boy)కు మొబైల్ దొరికినట్టు మొబైల్‌ దొరికిందని చెప్పాడు. ``రెయిన్ కోట్ వేసుకుని వర్షంలో తడుస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ మొబైల్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. అతడిని చూసి భావోద్వేగానికి గురయ్యా.స్విగ్వీ డెలివరీ బాయ్ రాహుల్ కుమార్, ఆటో డ్రైవర్లు నీలేష్, ప్రకాష్ అందరూ ముంబైపై నా నమ్మకాన్ని నిజం చేశారు. నగర ప్రజలలో మానవత్వం (Humanity), దయ ఇంకా సజీవంగా ఉన్నాయని నిరూపించారు`` అని మహిళ పేర్కొంది.

Updated Date - 2023-07-05T16:05:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising