snakes death valley: అక్కడ అడుగడుగునా పాముల కుప్పలే... ఆ సముద్రంలో మునుగుదామనున్నా కుదరదు.. ఇలాంటి వింతలెన్నో...
ABN, First Publish Date - 2023-03-14T11:26:07+05:30
ప్రపంచంలో అంతుచిక్కని రహస్యాలతో కూడిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటి వెనుక గల కారణాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తున్నారు.
ప్రపంచంలో అంతుచిక్కని రహస్యాలతో కూడిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటి వెనుక గల కారణాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తున్నారు. అలాంటి కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రపంచం(world)లోని ఏ ప్రాంతంలోనైనా కొన్ని నెలలకే వాతావరణం మారుతూ ఉంటుంది. కానీ ఇథియోపియాలో ఉన్న డనాకిల్ ఎడారి(Danakil Desert)లో నిత్యం వేడిగా ఉంటుంది. అది మనిషి చర్మాన్ని కాల్చివేసేంతగా ఉంటుంది.
ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత(temperature) ఏడాది పొడవునా 48 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. కొన్నిసార్లు కాస్త వేడి తగ్గుతుంది. గరిష్ట ఉష్ణోగ్రత 145 డిగ్రీల సెల్సియస్‌కు కూడా చేరుకుంటుంది. ఇంతటి వేడి వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని 'భూమిపై క్రూరమైన ప్రదేశం' అని అభివర్ణిస్తుంటారు. అమెరికాలోని 'డెత్ వ్యాలీ' కూడా విపరీతమైన వేడికి పేరుగాంచింది. ఈ ప్రదేశంలో కూడా ఒక్కోసారి ఉష్ణోగ్రత 130 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది.
1913లో ఇక్కడ రికార్డు స్థాయి(Record level)లో 134.06 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జోర్డాన్‌లోని మృత సముద్రం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఎవరూ ఈత కొట్టలేరు. అందులో ఈత కొట్టేందుకు ఎవరైనా వెళితే ఆటోమేటిక్‌గా పైకి తేలిపోతారు. ఈ నీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిలో జలచరాలు కనిపించవు. బ్రెజిల్‌లో ఉన్న 'ఇలాహ డా క్యూయిమాడా' ద్వీపాన్ని పాములు పాలిస్తుంటాయి. ఇక్కడ మూడు అడుగుల దూరంలో పాముల కుప్పలు కనిపిస్తాయి. ఇక్కడ పాములు(snakes) విస్తారంగా ఉండటంతో బ్రెజిలియన్ నేవీ ఈ ద్వీపంలో జనాల రాకపోకలపై నిషేధం విధించింది. ఈ ద్వీపం సావో పాలో(Sao Paulo) నుండి 20 మైళ్ల దూరంలో ఉంది. బ్లడ్ ఫాల్... అంటార్కిటికా(Antarctica)లో ఈ ప్రదేశం ఉంది. ఇక్కడ ఇనుము పరిమాణం చాలా ఎక్కువగా ఉందని, ఫలితంగా జలపాతాల నుంచి జారువారే నీరు ఎర్రటి రక్తం(blood) మాదిరిగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Updated Date - 2023-03-14T11:39:51+05:30 IST