ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Veera Simha Reddy 1st Report: ఫస్టాఫ్ ‘జై బాలయ్య’.. సెకండాఫ్ ఇదేందయ్యా?

ABN, First Publish Date - 2023-01-12T06:35:17+05:30

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna Nandamuri) హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) చిత్రం.. సంక్రాంతి స్పెషల్‌ (Sankranthi Special)గా ప్రపంచవ్యాప్తంగా నేడు (జనవరి 12) భారీ స్థాయిలో విడుదలైంది. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో...

Balakrishna Veera Simha Reddy Movie Talk
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna Nandamuri) హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) చిత్రం.. సంక్రాంతి స్పెషల్‌ (Sankranthi Special)గా ప్రపంచవ్యాప్తంగా నేడు (జనవరి 12) భారీ స్థాయిలో విడుదలైంది. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటించిగా దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలలో నటించారు. ఎర్లీ మార్నింగ్ 2 గంటలకే యుఎస్‌లో ప్రీమియర్స్ మొదలయ్యాయి. సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు ఒకలా.. ఫ్యాన్స్ మరోలా, సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా విశేషాలను తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ‘వీరసింహా రెడ్డి’ ఫస్ట్ రిపోర్ట్ ఇలా ఉంది. (Veera Simha Reddy 1st Report)

* ‘వీరసింహా రెడ్డి’ ఫస్టాఫ్ అదిరింది.. సెకండాఫ్ పరమ రొటీన్

* ముఖ్యంగా ‘చెన్నకేశవరెడ్డి, లెజెండ్’ మిక్స్ చేస్తే ‘వీరసింహా రెడ్డి’ అనేలా టాక్ నడుస్తుంది.

* బాలయ్య ఇందులో తండ్రీ కొడుకులుగా (నరసింహారెడ్డి, జై) కనిపించిన తీరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్

* రెండు పాత్రలలోనూ బాలయ్య స్క్రీన్ ప్రెజన్స్ ఫీస్ట్‌లా ఉంటుంది

* మాస్ సాంగ్స్, గవర్నమెంట్‌పై పేల్చే కొన్ని డైలాగ్స్ ఈ సినిమాకు బలం

* రొటీన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, రొటీన్ ఫైట్స్

* ఎమోషనల్ డ్రామా అంతగా కనెక్ట్ కాదు

* టోటల్ స్టోరీ అంతగా ఆకట్టుకోదు కానీ మాస్ ఎలివేషన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి.

* ఈ పండుగకి నడిచే సినిమానే కానీ.. సిస్టర్ సెంటిమెంట్‌కి ప్రేక్షకులు కనెక్ట్ అయితేనే..

* సంగీతం విషయంలో.. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. థమన్ ప్రాణం పెట్టేశాడు

* గతంలో బాలయ్య నటించిన ఓ నాలుగైదు సినిమాలను మిక్స్ చేసి.. గోపీచంద్ ఈ సినిమా తెరకెక్కించాడు

* రొటీన్ క్లైమాక్స్.. లాజిక్ లెస్ సీన్స్ (Veera Simha Reddy Social Media Report)

ఇది ఇప్పటి వరకు సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్. ఓవరాల్‌గా అయితే ఫస్టాప్ చాలా బాగుందని.. సెకండాప్ మాత్రం రొటీన్‌గా అంటే.. గతంలో బాలయ్య సినిమాలలో ఉన్న సీన్స్‌నే చూసినట్లుగా ఉందనేలా ఓవర్సీస్ ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం బాలయ్యని చూడడానికి రెండు కళ్లు చాలడం లేదని, థమన్ ఇరక్కొట్టేశాడని అంటున్నారు. ఇలా ప్రస్తుతానికైతే మిక్స్‌డ్ రిపోర్ట్ వినిపిస్తోంది. అయితే.. సంక్రాంతి పండుగ, బాలయ్య సినిమా.. ఈ రెండూ ఈ సినిమాకి ప్రధాన బలం అవుతాయని.. కలెక్షన్స్ పరంగా బాలయ్య బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతాడనేలా ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.. ‘వీరసింహా రెడ్డి’ పూర్తి రివ్యూ మరి కాసేపట్లో..

Updated Date - 2023-01-12T08:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising