ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nani: దసరాకు ముగింపు

ABN, First Publish Date - 2023-01-13T18:18:56+05:30

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న సినిమా 'దసరా' (Dasara). కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌ పాత్రను పోషిస్తుంది. ఈ మూవీ బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతుంది. పాన్ ఇండియాగా రూపొందుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న సినిమా 'దసరా' (Dasara). కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌ పాత్రను పోషిస్తుంది. ఈ మూవీ బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతుంది. పాన్ ఇండియాగా రూపొందుతుంది. మొదటిసారిగా నాని పూర్తి మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను ఈ మధ్యనే చిత్రీకరించారు. ఈ సీక్వెన్స్‌తో దసరా షూటింగ్ ముగిసింది. అందుకు సంబంధించిన ఫొటోలను నాని, కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘దసరా’ కు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. అతడు ఈ మూవీతోనే దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘దసరా’ ను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. నాని ఈ చిత్రంలో సిల్క్ స్మిత అభిమానిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఎడిటర్‌‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌‌గా అవినాష్‌ కొల్లా పని చేస్తున్నారు. ‘దసరా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 30 మార్చి 2023న విడుదల కానుంది.

Updated Date - 2023-01-13T18:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising