Nawazuddin Siddiqui House Help: ‘తిండి లేక అవస్థలు పడుతున్నా.. తనను రక్షించమంటూ..’
ABN, First Publish Date - 2023-02-20T11:04:49+05:30
గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui), ఆయన భార్య ఆలియా (Aaliya) మధ్య గొడవ కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui), ఆయన భార్య ఆలియా (Aaliya) మధ్య గొడవ కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నవాజ్‌తో పాటు ఆయన కుటుంబం కూడా తనని చాలా ఇబ్బందులు పాలుజేస్తున్నట్లు ఆలియా తీవ్ర ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి ఏదో ఒక వివాదం కారణంగా ఈ నటుడి పేరు న్యూస్‌లో నిలిస్తోంది. తాజాగా మరోసారి పని మనిషి కారణంగా నవాజ్ పేరు వార్తల్లో నిలిచింది.
ఆలియా సిద్ధిఖీ లాయర్ రిజ్వాన్ సిద్ధిఖీ (Rizwan Siddiqui) ఫిబ్రవరి 19న నవాజుద్దీన్ ఇంటి పనిమనిషి సప్నా రాబిన్ మసీహ్ వీడియోను షేర్ చేశారు. ట్వీట్టర్లో ఆయన షేర్ చేసిన క్లిప్‌లో.. సప్నా (Sapna) నటుడి కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయానని ఏడుస్తూ చెప్పడం కనిపిస్తోంది. తన దగ్గర డబ్బులు కూడా లేకపోవడంతో తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు సప్నా తెలిపింది. తనకు పెండింగ్‌లో ఉన్న జీతం చెల్లించాలని.. భారతదేశానికి తిరిగి వచ్చేందుకు ఏర్పాటు చేయాలని నవాజుద్దీన్‌ను వీడియోలో సప్నా కోరింది.
ఇది కూడా చదవండి: Tips to Healthy hair: ఖర్చు లేకుండా అందమైన కురులు కావాలా.. సలహాలు ఇచ్చిన ‘సాహో’ భామ..
అలాగే.. సప్నాను ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా, అలాగే దుబాయ్‌లో నటుడి పిల్లలను చూసుకోడానికి లాయర్ రిజ్వాన్ పేర్కొన్నారు. అయితే సప్నాను దుబాయ్‌లోనే పూర్తిగా వదిలేశారని కూడా ఆయన పేర్కొన్నారు. అలాగే ట్విట్టర్లో సప్నా నియామకానికి సంబంధించిన స్టేట్మెంట్ని, అంతేకాకుండా నవాజ్‌తో సప్నా కలిసి దిగిన ఓ పిక్‌ని కూడా ఆయన షేర్ చేశారు. దుబాయ్‌లోని నానా అవస్థలు పడుతున్న నవాబ్ సహాయకురాలు సప్నాని.. అత్యవసరంగా రక్షించాలని ప్రభుత్వ అధికారులను అభ్యర్థిస్తున్నానని రిజ్వాన్ తెలిపారు.
Updated Date - 2023-02-20T11:04:50+05:30 IST