ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nawazuddin Siddiqui: కోడలిపై ఫిర్యాదు ఇచ్చిన హీరో తల్లి

ABN, First Publish Date - 2023-01-23T16:51:35+05:30

విభిన్న చిత్రాలు, కొత్త రకం పాత్రలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). అతడి తల్లి మెహ్రున్సిసా సిద్దిఖీ (Mehrunisa Siddiqui) నవాజ్ భార్య జైనాబ్ అలియాస్ ఆలియా‌కు వ్యతిరేకంగా వెర్సోవా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్న చిత్రాలు, కొత్త రకం పాత్రలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). అతడి తల్లి మెహ్రున్సిసా సిద్దిఖీ (Mehrunisa Siddiqui) నవాజ్ భార్య జైనాబ్ అలియాస్ ఆలియా‌కు వ్యతిరేకంగా వెర్సోవా పోలీసులుకు ఫిర్యాదు చేసింది. నవాజ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్స్ కింద ఆలియాపై కేసును నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెను ప్రశ్నిస్తున్నారు.

నవాజుద్దీన్ సిద్దిఖీ తల్లి మెహ్రున్సిసా సిద్దిఖీ, భార్య ఆలియాకు మధ్య ఆస్తిపాస్తుల విషయంలో విభేదాలు తలెత్తాయి. వాగ్యుద్ధానికి దిగారు. ఫలితంగా మెహ్రున్సిసా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవాజుద్దీన్ సిద్దిఖీకీ ఆలియా (Alia) రెండో భార్య. ఈ జంట 2010లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏమైందో తెలియదు కానీ వీరి దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తాయి. విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా నవాజుద్దీన్‌పై ఆలియా తీవ్రమైన ఆరోపణలు చేసింది. విడాకుల కోసం మే 2020లో కోర్టును ఆశ్రయించింది. అనంతరం నవాజుద్దీన్, అతడి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా 2020 జులైలో ముంబై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. గృహ హింసకు గురి చేశారని పేర్కొంది. కొన్ని నెలల తర్వాత తమ పెళ్లికి రెండో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. జీవితం సాఫీగా సాగిపోతున్న దశలో మరోసారి పెళ్లి స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. నవాజుద్దీన్ సిద్దిఖీ ‘బజరంగీ భాయిజాన్’, ‘బద్లాపూర్’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Updated Date - 2023-01-23T16:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising