ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nayanthara: ‘గాడ్‌ఫాదర్’ డైరెక్టర్‌తో మరో సినిమా..!

ABN, First Publish Date - 2023-02-03T18:42:00+05:30

అందం, అభినయంతో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న నటి నయనతార (Nayanthara). అభిమానులందరు ముద్దుగా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ అందాల భామ గతేడాది విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) ను వివాహం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందం, అభినయంతో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న నటి నయనతార (Nayanthara). అభిమానులందరు ముద్దుగా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ అందాల భామ గతేడాది విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) ను వివాహం చేసుకున్నారు. పెళ్లి పనుల కారణంగా సినిమాలకు నెల రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. వివాహం అనంతరం ఆమె నుంచి కొత్త చిత్రాల కబుర్లు రాలేదు. తాజాగా ఆమె రెండు కొత్త ప్రాజెక్టులకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం.

మోహన్ రాజా (Mohan Raja) కు దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించి పెట్టిన సినిమా ‘తని ఒరువన్’ (Thani Oruvan). జయం రవి, నయన తార హీరో, హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. మోహన్ రాజా ఈ మూవీకి సీక్వెల్‌ ‘తని ఒరువన్ 2’ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటించనుందని తెలుస్తోంది. ఆమె అంగీకారం తెలిపిందని సమాచారం అందుతుంది. అందుకు సంబంధించి చిత్ర బృందం త్వరలోనే ప్రకటనను జారీ చేయనుందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. మోహన్ రాజా చివరగా చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ కు దర్శకత్వం వహించారు. మిత్రన్ జవహర్ అనే దర్శకుడితోను నయన్ సినిమా చేయనున్నారు. హీరోయిన్ ఒరియెంటేడ్ కథతో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇక నయనతార కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘జవాన్’ (Jawan) లో నటిస్తున్నారు. షారూఖ్ ఖాన్ హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-02-03T18:45:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising