Shah Rukh Khan: ముద్దిచ్చి బాయ్ చెప్పింది.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2023-02-13T14:03:20+05:30

బాలీవుడ్‌ స్టార్ షారుఖ్ ఖాన్, కోలీవుడ్ నటి నయనతార జంటగా ‘జవాన్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Shah Rukh Khan: ముద్దిచ్చి బాయ్ చెప్పింది.. వీడియో వైరల్
Nayanathara
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), కోలీవుడ్ నటి నయనతార (Nayanthara) జంటగా ‘జవాన్’ (Jawan) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ యువ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది జూన్‌లో విడుదలకానుంది. ఈ సినిమా షూటింగ్‌లోనే ఈ నటీనటుల మధ్య మంచి స్నేహం కుదిరింది. తాజాగా షారుఖ్ ఖాన్ చెన్నైకి వచ్చాడు. ఈ తరుణంలోనే నయనతార ఇంటికి వెళ్లి ఆమెని కలిశాడు. అక్కడే వారితో కొద్దిసేపు గడిపి వెళ్లాడు. అనంతరం షారుఖ్ తిరిగి వెళుతుండగా.. నయనతార కారు వద్దకు వచ్చి సాగనంపుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఇది కూడా చదవండి: Janhvi Kapoor: ‘దాని గురించి ఎవరూ మాట్లాడరు.. అందరికీ ఇదే కావాలి’

అందులో.. అభిమానులను దాటుకొని వచ్చిన షారుఖ్‌ని నయనతార కారు ఎక్కించింది. వెళ్లేముందు షారుఖ్ బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ వైరల్ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇద్దరు లెజెండ్స్ కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చూస్తుంటే భలే అనిపిస్తోంది. గొప్ప స్నేహం’.. ‘చెన్నైకి స్వాగతం.. సూపర్‌స్టార్’ అని రాసుకొస్తున్నారు. అయితే, షారుఖ్ ఆకస్మికంగా నయనతారను కలుసుకోవడం వెనుక కారణాలు మాత్రం తెలియరాలేదు. కోలీవుడ్‌ వర్గాల సమాచారం మేరకు.. వీరిద్దరు కలిసి మరో కొత్త ప్రాజెక్టులో నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. కాగా.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇటీవలే ‘పఠాన్‌’ చిత్రంతో షారుఖ్ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-13T14:10:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising