ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు అద్దాలపై అంటించి ఉందో పేపర్.. ఏం రాసి ఉందా అని అంతా చదివిన యజమానికి..!

ABN, First Publish Date - 2023-08-05T15:53:37+05:30

కారు డ్రైవింగ్ చేసే సమయంలోనే కాదు, ఇంటి ముందు పార్కింగ్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పార్కింగ్ విషయంలో ఇంటి చుట్టు పక్కల వారితో అనవసర వివాదాలు తలెత్తుతాయి. ఒక్కోసారి ఆ గొడవ సోషల్ మీడియా వరకు వెళ్లి హాట్ టాపిక్‌గా మారుతుంది.

కారు డ్రైవింగ్ చేసే సమయంలోనే కాదు, ఇంటి ముందు పార్కింగ్ (Car Parking) చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పార్కింగ్ విషయంలో ఇంటి చుట్టు పక్కల వారితో (Neighbors) అనవసర వివాదాలు తలెత్తుతాయి. ఒక్కోసారి ఆ గొడవ సోషల్ మీడియా వరకు వెళ్లి హాట్ టాపిక్‌గా మారుతుంది. తాజాగా బ్రిటన్‌ (Britain)కు చెందిన ఇరుగుపొరుగు వ్యక్తులు కార్ పార్కింగ్ విషయంలో వెరైటీగా గొడవపడ్డారు. ఆ ఘటన సోషల్ మీడియాలో హాట్ చర్చకు (Viral) కారణమైంది.

బ్రిటన్‌లోని ఓ ప్రాంతంలోని ఓ వ్యక్తి తన ఇంటి ముందు కారు పార్క్ చేశాడు. అయితే ఇటీవల అతను ఇంటి నుంచి బయటకు వచ్చే సరికి అతడి కారుపై ఓ పేపర్ అంటించి ఉంది. దానిపై ``దయచేసి మీ కారుని తీసివేయండి. ధన్యవాదాలు`` అని రాసి ఉంది. దానికి ప్రతిస్పందనగా ఆ కారు యజమాని మరో నోట్‌ను రాసి అక్కడే అంటించాడు. ``నా కారును ఎందుకు తీసివెయ్యాలో తెలుసుకోవచ్చా? ఆ కారుకు ట్యాక్స్ కట్టాను. ఇన్సూరెన్స్ కట్టాను. నేను నివసిస్తున్న వీధిలో పన్ను కడుతున్నాను. ఇంతకీ మీరు ఎవరు?`` అని ప్రశ్నించాడు (Hilarious exchange over car parking).

Viral Video: బాబోయ్.. ఇదేం వింత.. అచ్చం మనిషిలాగానే ఉన్న ఈ వెరైటీ జంతువేంటంటే..!

కారు ద్వారా జరుగుతున్న ఆ సంవాదనను స్థానికుడు ఒకరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోపై చాలా మంది స్పందిస్తున్నారు. ``నేరుగా గొడవపడకుండా ఇదో మంచి పద్ధతి``, ``అక్కడి నుంచి తీసేసి ఎక్కడ పెట్టాలి? ఇంటిలోపలికి తీసుకెళ్లాలా?``, ``చాలా మంది తమ ఇంటి ముందు పబ్లిక్ స్థలాన్ని కూడా తమదే అనుకుంటారు``, ``తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-05T15:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising