Netflix: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు బాంబులాంటి వార్త.. కొత్త కండీషన్లు షురూ.. ఇకపై వాటికి నో పర్మిషన్..!
ABN, First Publish Date - 2023-05-24T17:31:24+05:30
నెట్‌ఫ్లిక్స్ యూజర్లా? మీకు ఇష్టమైన ఓటీటీ సంస్థ ఇదేనా? అయితే మీకిది బ్యాడ్‌న్యూసే. సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం. తెలియాలంటే
నెట్‌ఫ్లిక్స్ యూజర్లా? మీకు ఇష్టమైన ఓటీటీ సంస్థ ఇదేనా? అయితే మీకిది బ్యాడ్‌న్యూసే. సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం. తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఓటీటీ సంస్థల్లో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. దీంట్లో వీక్షించాలంటే దీనికో పాస్‌వర్డ్ ఉంటుంది. ఇకపై ఈ పాస్‌వర్డ్‌ను కేవలం సమీప కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అలా కాకుండా ఇతరులతో పాస్‌వర్డ్ షేర్ చేసుకుంటే మాత్రం అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన (New conditions) ఇండియాలో ఎప్పటి నుంచీ అమల్లోకి వస్తుందనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఈ విధానాన్ని ఇప్పటికే కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అక్కడ సత్ ఫలితాలివ్వడంతో తాజాగా అమెరికా సహా మొత్తం వందకు పైగా దేశాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
నెట్‌ఫ్లిక్స్ (Netflix) మొదటి నుంచీ పాస్‌వర్డ్ షేరింగ్‌కు వ్యతిరేకం కాదు. 2017లో స్వయంగా కంపెనీయే పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకోవాలని ప్రచారం చేసింది. నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడంలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ ఈ వ్యూహాన్ని అనుసరించింది. కానీ కరోనా సంక్షోభం సద్దుమణిగిన తర్వాత పరిస్థితులు మారాయి. కొత్త యూజర్లలో చేరకపోగా... ఉన్న యూజర్లు కూడా ఇతర ఓటీటీల వైపు వెళ్లిపోయారు. ఈ క్రమంలో కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే పాస్‌వర్డ్ షేరింగ్‌కు (password sharing users) అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. పాస్‌వర్డ్ షేరింగ్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ తమ యూజర్లకు ఈ-మెయిళ్లు పంపుతోంది. ఇంట్లో వారు కాకుండా బయటి వాళ్లను చేర్చుకోవాలంటే ఇకపై అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అమెరికాలో ఈ ఫీజును నెలకు 7.99 డాలర్లుగా నిర్ణయించగా.. యూకేలో 4.99 యూరోలుగా తెలిపింది.
అదనపు సభ్యులకు కూడా ప్రత్యేకంగా పాస్‌వర్డ్, ప్రొఫైల్ ఉంటుంది. ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్లే ఫీజు చెల్లించాలి. అదనంగా వచ్చిన వారికి కూడా ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. పైగా ప్రధాన యూజర్‌కు ఏ దేశంలోనైతే ఖాతా ఉందో.. అదనపు సభ్యుడికి కూడా అక్కడే ఖాతా యాక్టివేట్ అయి ఉండాలి. ఒకసారి ఒక డివైజ్‌లో మాత్రమే కంటెంట్‌ను వీక్షించడం, డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. అదనపు ప్రొఫైల్స్, కిడ్స్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకునే అవకాశం ఉండదు.
ఇది కూడా చదవండి: Viral Video: మెట్రో రైల్లో కింద కూర్చుని ఈ కుర్రాళ్లు ఏం చేస్తున్నారనే కదా మీ డౌట్.. అసలు వీళ్లెవరో తెలిస్తే..!
ఇది కూడా చదవండి: WhatsApp: అయ్యో పాపం.. వాట్సప్‌లో చేసిన ఒక్క మిస్టేక్‌తో ఓ టెకీకి రూ.42 లక్షలు మటాష్.. ఈ టిప్స్‌ను పాటిస్తే మీరు సేఫ్..!
ఇది కూడా చదవండి: Bride: వారం రోజుల క్రితమే పెళ్లి.. ఇంట్లో కనిపించని భార్య.. తల్లిదండ్రులను అడిగినా తెలీదని చెప్పడంతో ఆమెకు ఫోన్ చేసిన ఆ భర్తకు..!
Updated Date - 2023-05-24T17:31:28+05:30 IST