Manoj Mounika: భారీ బందోబస్తు నడుమ.. చేయి చేయి పట్టుకుని.. మొదటిసారి అలా..
ABN, First Publish Date - 2023-03-05T11:24:05+05:30
త కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ.. మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనిక రెడ్డి (Bhuma Mounika Reddy) వివాహ బంధంతో ఒకటయ్యారు.
గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ.. మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనిక రెడ్డి (Bhuma Mounika Reddy) వివాహ బంధంతో ఒకటయ్యారు. ఫిలింనగర్‌లోని మనోజ్ సోదరి, నటి మంచు లక్ష్మి (Manchu Laxmi) నివాసంలో ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మార్చి 3న పెళ్లి వేడుక జరిగింది. ఈ మ్యారేజ్ పలువురు సినీ, ప్రముఖులు హాజరై నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. గత రెండు రోజులుగా వీరికి సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండడం తెలిసిందే.
తాజాగా మనోజ్ భార్యతో కలిసి అత్తారింటికి బయలు దేరిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అందులో.. మంచు లక్ష్మి ఇంటి నుంచి ఈ జంట చేయి చేయి పట్టుకుని చాలా సంతోషంగా కర్నూల్‌కి బయలుదేరారు. భారీ బందోబస్తు మధ్య రోడ్డు మొత్తం కార్లు, కాన్వాయ్‌లతో వీరి పయనమయ్యారు. మొదట ఎస్వీ సుబ్బారెడ్డి ఇంటికి వెళతారు. అనంతరం ఆళ్లగడ్డలోని మౌనిక తల్లిదండ్రులైన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి సమాధులను దర్శించుకుని వారి ఆశీర్వాదాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ జంట గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉండగా.. ఈ ఇద్దరికీ ఇది రెండు వివాహమే.
Updated Date - 2023-03-05T11:54:50+05:30 IST