ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కరోజులోనే హనీమూన్‌ నుంచి తిరిగొచ్చేసిన కొత్త పెళ్లి జంట.. మర్నాడే భర్తపై కేసు పెట్టిన భార్య.. అసలు కారణమేంటంటే..

ABN, First Publish Date - 2023-03-10T13:45:46+05:30

అమ్మాయి ప్రవర్తన వెనుక ఉన్న నిజం తెలుసుకుని అమ్మాయి తల్లిదండ్రులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పిల్లల పెళ్ళి ఎంతో గొప్పగా చేయాలన్నది ప్రతి తల్లిదండ్రుల కల. వారు ధనవంతులు కావడంతో తమ కూతురి పెళ్ళి ఆకాశమంత పందిరి వేసి ఎంతో గొప్పగా జరిపించారు. మంచి ముహూర్తం చూసి కూతురు అల్లుడిని హనీమూన్ కు పంపించారు. కానీ అలా వెళ్ళిన కొత్త జంట మరుసటిరోజే తిరిగొచ్చింది. వచ్చీరాగానే ఆ అమ్మాయి నేరుగా పోలీస్ స్టేషన్ కు బయల్దేరింది. అమ్మాయి ప్రవర్తన వెనుక ఉన్న నిజం తెలుసుకుని అమ్మాయి తల్లిదండ్రులు షాకయ్యారు. ఈ సంఘటన గురించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

ఉత్తర ప్రదేశ్(Uttar pradesh) రాష్ట్రం ఆగ్రా(Agra)లో ధనవంతుల కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని వారి స్థాయికి తగిన అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. పెళ్ళిలో అబ్బాయికి భారీగానే కట్న కానుకలు ఇచ్చారు. వారిద్దరినీ హనీమూన్ కు పంపడానికి ముహూర్తం చూడగా పెళ్ళి తరువాత 10రోజులకు కానీ వారికి ముహూర్తం దొరకలేదు. దాంతో అదే ముహూర్తానికి సిమ్లాకు టికెట్స్ బుక్ చేసి కూతురు అల్లుడిని సిమ్లాకు పంపారు. కొత్తదంపతులు ఇద్దరూ ముందే బుక్ చేసిన హోటల్ గదికి వెళ్ళి బస చేశారు.

గదిలో అమ్మాయితో ఎంతో క్లోజ్ గా ఉండాల్సిన అబ్బాయి అమ్మాయితో మాట్లాడకుండా ఫోన్ లో వీడియో కాల్ లో ఎవరితోనో క్లోజ్ గా మాట్లాడుతుండటం చూసి అమ్మాయి షాకయ్యింది. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావని నిలదీసింది. 'నేను నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను నీకేంటి ప్లాబ్లం?' అని అతను ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడాడు. అమ్మాయి గొడవకు దిగడంతో బలం కొద్ది చావుదెబ్బలు కొట్టాడు. అమ్మాయి గట్టిగట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులు బాది అమ్మాయిని అతనినుండి కాపాడారు. తరువాత అతను ఆ అమ్మాయితో 'మనం ఇంటికి వెళ్ళాక నువ్వు మీ అమ్మానాన్నలతో 50లక్షలు తీసుకునిరావాలి' అని డిమాండ్ చేశాడు. ఎందుకని ఆ అమ్మాయి అడిగితే.. కెనడాలో ఇల్లు కొనాలని చెప్పాడు. 'నేను అడగను, పెళ్ళిలో కట్నం ఇచ్చారు కదా.. మళ్ళీ మా అమ్మానాన్నలను ఎందుకడగాలి?' అని సమాధానం చెప్పింది. దీంతో అతడు మళ్ళీ అమ్మాయి మీద దాడి చేశాడు. భయపడిపోయిన అమ్మాయి మరుసటిరోజే ఆగ్రాకు చేరుకుంది. అప్పుడే వచ్చేశారేంటి అని అడిగిన అత్తామామలకు అతడు చేసిన నిర్వాకం మొత్తం చెప్పింది. విషయమంతా విన్న అత్తమామలు కొడుకును దండించి దారిలో పెడతారని అనుకుంటే, వారు అమ్మాయినే సర్దుకుపొమ్మని చెప్పారు. అమ్మాయి ఇలా కాదనిపోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి బయల్దేరింది. అయితే అమ్మాయి అత్త ఆమెకు పాలల్లో నిద్రమాత్రలు వేసి నిద్రపుచ్చింది. సుమారు పదిరోజులు అలాగే చేసింది. అమ్మాయి నగలన్నీ తీసుకుని తన దగ్గరే ఉంచుకుంది.

అబ్బాయి రోజూ తాగొచ్చి అమ్మాయిని కొట్టేవాడు. ఒకవైపు భర్త చేసే పనులు, మరొక వైపు అత్తమామలు చేస్తున్న దారుణాలు భరింలేక ఆ అమ్మాయి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అమ్మాయి తల్లిదండ్రలు వచ్చి విషయం తెలుసుకుని షాకయ్యారు. పోలీస్ స్టేషన్లో అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు వరకట్న వేధింపుల కేసు, లైంగిక దాడి మొదలైన సెక్షన్ల మీద కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.

Read also: Watermelon In Fridge: సమ్మర్ కదా అని పుచ్చకాయలను తెగ లాగించేస్తున్నారా..? ఫ్రిడ్జ్‌లో పెట్టి మాత్రం అస్సలు తినొద్దు.. ఎందుకంటే..!


Updated Date - 2023-03-10T13:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising