ప్రాణాలు తీస్తున్న కొత్త వైరస్..లాక్డౌన్ విధించిన దేశం
ABN, First Publish Date - 2023-02-18T08:16:24+05:30
కరోనా దెబ్బకు విలవిలలాడిన ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మహమ్మారి చూపించిన ప్రతాపానికి అని దేశాలు చిగురుటాకుల...
కరోనా దెబ్బకు విలవిలలాడిన ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మహమ్మారి చూపించిన ప్రతాపానికి అని దేశాలు చిగురుటాకుల వణికాయి. అయితే కరోనాకు వ్యాక్సిన్ రావడంతో ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా తగ్గిందనుకునే క్రమంలో ఇప్పుడు మరో వైరస్ ముంచుకోస్తోంది. ఇప్పటికే పశ్చిమాఫ్రికా(West Africa) తీరంలోని ఈక్వటోరియల్ కెన్యా(Equatorial Kenya) కొత్త వైరస్(new virus) ప్రాణాలు తీస్తోంది. మార్బర్గ్ వైరస్ డిసిస్గా పిలిచే ఈ కొత్త మహమ్మారి కారణంగా..ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గినియాలో ఈ వైరస్‌తో 9 మంది చనిపోయినట్లు డబ్ల్యూహెచ్‌వో(WHO) వెల్లడించింది. తీవ్ర జ్వరం, తలనొప్పి, ఆయాసం, రక్తపు వాంతులు, విరేచనాలతో గంటల వ్యవధిలోనే అక్కడి ప్రజలు ప్రాణాలు కొల్పోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో లాక్డౌన్(Lockdown) విధించారు. ఎంవీడీ లక్షణాలున్న 200ల మందిని క్వారంటైన్(Quarantine)కు తరలించారు. ఆ ప్రాంతంలోని వారందరికీ టెస్టులు నిర్వహిస్తున్నారు. లాసా, ఏబోల వంటి వైరస్లు ఈ ప్రాంతంలోనే వెలుగు చూశాయి. దీంతో ఇప్పుడు కొత్త వైరస్ పుట్టుకురావడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాణంతాక వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స లేదు. ఏంవీడీ (MVD) రక్తస్త్రావంతో కూడిన తీవ్ర జ్వరానికి దారి తీస్తుంది. ఈ వైరస్ బారిన పడినవారిలో 88 శాతం మంది చనిపోతున్నారు. 1967లో ఉగాండ నుంచి దిగుమతి చేసుకున్న గ్రీన్ మంకీస్ ద్వారా ఈ వైరస్ జర్మనీ, సెర్బీయాలో ప్రబళింది. మళ్లీ ఈ వైరస్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. పైగా ఇదీ అంటు వ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సులువుగా సోకుతుంది. ఈ వైరస్ సోకిన వెంటనే లక్షణాలు బయటపడవు.
గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే వారికి ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. ఏంవీడీ బారినపడ్డవారిలో తలనొప్పి, జ్వరం, ఆయాసం వస్తాయి. మూడు రోజుల తర్వాత వీరేచనాలు రక్తపు వాంతులు మొదలవుతాయి. వారంలో ఈ వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించి ప్రాణాలు తీస్తోంది. ఈ వ్యాధికి ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ప్రస్తుతం ఈక్వటోరియల్ కెన్యాలో ఈ తరహా కేసులు బయటపడటంతో పొరుగు దేశం అయిన కెమరూన్ సరిహద్దులను మూసివేంది. తమ దేశంలోకి ఎవరు రాకుండా ఆంక్షలు విధించింది.
Updated Date - 2023-02-18T08:28:25+05:30 IST