New Zealand PM: చైనా పర్యటనకు న్యూజిలాండ్ ప్రధాని రెండు విమానాల్లో వెళ్లాడు.. ఎందుకో తెలుసా?
ABN, First Publish Date - 2023-06-26T16:48:41+05:30
న్యూజీలాండ్ ప్రధాని క్రిస్ హిప్‌కిన్స్ రెండు జెట్ ఫైటర్ విమానాలను తన వెంట తెచ్చుకున్నాడు. మొదటిది ఎయిర్‌ఫోర్స్ బోయింగ్ 757లో తాను ప్రయాణించగా.. రెండోదానిని దీనికి తోడుగా తెచ్చుకున్నాడు. అయితే దీని వెనక పెద్ద కథే ఉంది.. అదేంటో తెలుసుకుందాం.. రండి..
న్యూజీలాండ్ ప్రధాని(New Zealand PM) క్రిస్ హిప్‌కిన్స్(Chris Hipkins) చైనాలో(China) పర్యటిస్తున్నారు. న్యూజిలాండ్ పెద్ద కంపెనీల బిజినెస్ విస్తరణ చేయాలనే ఉత్సుకతతో అధికారులు, ప్రతినిధులతో కలిసి హిప్‌కిన్స్.. చైనాతో సంప్రదింపులు జరుపేందుకు వచ్చాడు. ఈ క్రమంలో క్రిస్ హిప్‌కిన్స్ రెండు జెట్ ఫైటర్ విమానాలను(Air Force Planes) తన వెంట తెచ్చుకున్నాడు. మొదటిది ఎయిర్‌ఫోర్స్ బోయింగ్ 757లో తాను ప్రయాణించగా.. రెండోదానిని దీనికి తోడుగా తెచ్చుకున్నాడు. అయితే దీని వెనక పెద్ద కథే ఉంది.. అదేంటో తెలుసుకుందాం.. రండి..
క్రిస్ హిప్‌కిన్స్ ఆదివారం న్యూజిలాండ్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ బోయింగ్ 757లో బీజింగ్ వెళ్లాడు. తన దేశంలోని అతిపెద్ద కంపెనీ మార్కెట్ విస్తరించాలనే తపనతో కంపెనీ ప్రతినిధులతో మొదటి బోయింగ్ విమానంలో బీజింగ్ వెళ్లాడు. రెండో విమానం మనీలా వరకు తోడుగా వచ్చింది. రెండు విమానాలు ఎందుకన్న సందేహాలకు సమాధానంగా ఏదైనా సాంకేతిక లోపాలు ఏర్పడితే బ్యాకప్ ఉంటుందని న్యూజిలాండ్ ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించింది. యాత్ర ప్రాముఖ్యత, అతిపెద్ద దేశంలో వాణజ్య భాగస్వామ్యం నెలకొల్పే మిషన్ విజయవంతం కావాలంటే ఆమాత్రం వెళ్లాలి అన్నట్లుగా వెల్లింగ్టన్‌లో తెలిపారు.
అయితే కాలం చెల్లిన న్యూజిలాండ్ ఎయిర్ ప్లీట్‌లు ఇప్పుడు జాతీయ స్థాయిలో విమర్శలకు తావిస్తున్నాయి. ప్రధాని క్రిస్ హిప్‌కిన్స్ పర్యటనకు రెండు విమానాలు తీసుకెళ్లడంపై న్యూజిలాండ్ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. రక్షణ వ్యవస్థలో పేలవమైన లోపాలను వివరిస్తూ..తమ దేశ ఇబ్బందికర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.
క్లైమేట్ ఎమర్జెన్సీ ఉంటే..35 ఏళ్లకిందటి జెట్ విమానాలను వినియోగించడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్ష నేషనల్ పార్టీ నాయకుడు క్రిస్టోఫర్ లక్సన్ అన్నారు. ‘‘రెండో విమానం నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్.. ఫోర్డ్ రేంజర్‌ను 606 టైమ్స్ నడిపితే వచ్చేంత కాలుష్యానికి సమానం’’అని లిబర్టేరియన్ పార్టీ లీడర్ డేవిడ్ సీమోర్ అన్నారు. ‘‘ఎవరైనా విదేశాలకు వెళితే సెల్‌ఫోన్ లాంటివి అదనంగా తీసుకెళ్తారు.. కానీ మా ప్రధాని విదేశాలకు వెళితే బ్యాకప్‌గా కాలం చెల్లిన విమానాలను తీసుకెళ్లాల్సి వస్తోందని’’ సీమోర్ విమర్శించారు.
కాలం చెల్లిన న్యూజిలాండ్ ఎయిర్‌ప్లీట్ల సాంకేతిక సమస్యల కారణంగా రాజకీయ నాయకులు పలుచోట్ల చిక్కకుపోయిన ట్రాక్ రికార్డు కూడా ఉంది. గతేడాది అప్పటి ప్రధాని జసిండా.. తాను ప్రయాణిస్తున్న సీ-130 వైమానిక విమానం చెడిపోవడంతో అంటార్కిటికాలో చిక్కుకుపోయింది. ఆమెను మరో విమానంలో ఇంటికి చేర్చాల్సి వచ్చింది. 2022లో బైడెన్ కలిసేందుకు అమెరికా వెళ్లినపుడు జెసిండాకు జెట్ విమానాలతో తిప్పలు తప్పలేదు. ఆమె ప్రయాణించిన బోయింగ్ విమానం వాషింగ్టన్‌లో పాడైపోయింది. దీంతో ఆమె సాధారణ ప్రయాణికురాలిలా ఎయిర్‌లైన్స్ విమానంలో వెళ్లాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
Updated Date - 2023-06-26T16:48:41+05:30 IST