Newly Married Couples: పెళ్లి ఫిక్సయిందా..? ఈ 7 సలహాలను పాటిస్తే చాలు.. సంసార జీవితం యమా హ్యాపీ..!
ABN, First Publish Date - 2023-09-21T09:56:40+05:30
ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా ఇద్దరు వ్యక్తులు కలసి జీవించేటప్పుడు సహజంగానే కొన్ని పొరపాట్లు, అపార్జాలు చోటు చేసుకుంటాయి. కానీ ఈ 7 సలహాలు పాటిస్తే..
మనిషి జీవితంలో అతిపెద్ద మలుపు పెళ్ళి. పెళ్లితో బ్యాచిలర్ జీవితాలు కాస్తా చాలా మార్పులకు లోనవుతాయి. ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా ఇద్దరు వ్యక్తులు కలసి జీవించేటప్పుడు సహజంగానే కొన్ని పొరపాట్లు, అపార్జాలు చోటు చేసుకుంటాయి. పెళ్లైన కొత్తలో వీటన్నింటిని లైట్ గా తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ తరువాత చిన్నగా గొడవలు మొదలై అవి వివాహ బంధాన్ని మూన్నాళ్ళ ముచ్చటగా మారుస్తాయి. అలా కాకుండా పెళ్లైననాటి నుండి ఎంత కాలం గడిచినా సంసార జీవితం సంతోషంగా ఉండాలంటే కొత్తగా పెళ్లైన వారు ఈ 7సలహాలను పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుంటే..
మంచి కమ్యునికేషన్..
కొత్తగా పెళ్ళైన వారి మధ్య నిజాయితీతో కూడిన కమ్యునికేషన్ ఉండాలి. ఎలాంటి దాపరికాలు లేకుండా ఏ విషయాన్ని అయినా షేర్ చేసుకోవాలి. మనసులో ఉండే భయాలు, కోరికలు, ఆందోళనలు, అనుమానాలు ఇలా ఏవైనా సరే భాగస్వామితో పంచుకోవాలి. అలాగే చెప్పే విధానం కూడా ఎంతో ముఖ్యం. కొందరికి తమ సమస్యలు చెప్పడమే తప్ప ఎదుటివారు ఏదైనా చెబితే విసిగించుకుని పక్కకు వెళ్లిపోతుంటారు. కానీ అది చాలా తప్పు. తమ విషయాలు చెప్పేటప్పుడు ఎంత శ్రద్దతో చెబుతారో, భాగస్వామి తన విషయాలు చెప్పేటప్పుడు అంతే శ్రద్దతో వినాలి, అర్థం చేసుకోవాలి.
Viral: ఇది కదా అసలు సిసలు విజయమంటే.. స్కూలు మానేసి 24 ఏళ్లయిన తర్వాత.. ఆ మహిళకు ఏకంగా గ్రాడ్యుయేట్ పట్టా..!
సమయం కేటాయించాలి..
ఇప్పటి తరంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నవారే ఎక్కువ. బిజీ షెడ్యుల్ కారణంగా ఒకరిని ఒకరు పట్టించుకోకపోవడం, ఒకరికి ఒకరు సరిగా అందుబాటులో లేకపోవడం జరిగితే వారి మధ్య బంధం పేలవంగా మారుతుంది. బంధం దృఢంగా ఉండాలంటే ఒకరికోసం మరొకరు సమయాన్ని కేటాయించుకోవాలి. ఉన్న సమయంలోనే ఇద్దరు కలసి సంతోషంగా గడపాలి.
వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దు..
వ్యక్తిత్వం వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలసి సమయాన్ని గడిపినా, ఒకరి కోసం మరొకరు కాంప్రమైజ్ అయినా ఎవరి గుర్తింపు వారికి ఉండాలి. వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు. వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచులు, లక్ష్యాలు మొదలైనవి ఒకరికోసం ఒకరు వదులుకోకూడదు.
గొడవల పరిష్కారం..
ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటున్నప్పుడు చిన్న చిన్న గొడవలు, అభిప్రాయ బేధాలు, కోపాలు రావడం సహజం. అయితే వాటిని జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఏదైనా గొడవ జరిగితే ఒకరినొకరు నిందించుకుని ఆ సమయంలో ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపడం వంటి పనులు చేయకూడదు. గొడవకు గల కారణం ఏంటో చర్చించుకుని దాన్ని పరిష్కరించుకోవాలి. అది ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.
Viral News: ఇదేం డిజైన్ బాబోయ్.. కొంపదీసి ఇది బెల్టు కాదు కదా..? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన డ్రస్సు..!
సపోర్ట్ చేసుకోవాలి..
ఏ వ్యక్తికి అయినా సపోర్ట్ అనేది జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ లక్ష్యాల విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, మద్దతుగా నిలవడం ద్వారా ఇద్దరూ కలసి ఎదుగుతారు. వైఫల్యాలు ఎదురైనప్పుడు ఓదార్పు ఇవ్వడం, ఆత్మవిశ్వాసాన్ని నింపడం, సామర్థ్యాన్ని గుర్తుచేయడం ద్వారా ఒకరిని మరొకరు గెలిపించినవారు అవుతారు.
ఇగో చూపించకండి..
భార్యాభర్తల మధ్య ఇగో ఉంటే అది బంధం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఒకరి మీద మరొకరికి ఉన్న ఇష్టాన్ని చెప్పడం నుండి ఏదైనా సంధర్భంలో థాంక్స్ చెప్పడం వరకు ఎలాంటి సంకోచం లేకుండా చెప్పాలి. భాగస్వామి సాధించే విజయాలకు మెచ్చుకోవడం, వారి గొప్పదనాన్ని ఇతరుల ముందు ప్రసంశించడం వంటి పనుల వల్ల బంధం బలపడుతుంది.
శృంగార జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి..
కాలం గడిచేకొద్ది వ్యక్తుల మధ్య శృంగారం కూడా తగ్గుతూ వస్తుంది. కానీ ఇది బంధాన్ని బలహీనపరుస్తుంది. భార్యాభర్తల మధ్య శారీరక సాన్నిత్యం అలాగే ఉంటే అది మానసిక భావోద్వేగాలను, మానసిక పరిస్థితిని చక్కగా ఉంచుతుంది. దీనివల్ల జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది.
Credit Card: అమల్లోకి కొత్త రూల్.. క్రెడిట్ కార్డులకు ఇప్పటిదాకా ఉన్న ఈ ఫెసిలిటీ.. ఇకపై అస్సలు ఉండదట..!
Updated Date - 2023-09-21T10:33:56+05:30 IST