ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Miss Universe 2023: విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న షెన్సిస్ పలాసియోస్

ABN, First Publish Date - 2023-11-19T10:47:20+05:30

నికరాగ్వాకు చెందిన అందాల భామ షెన్నిస్ పలాసియోస్ ‘ మిస్ యూనివర్స్ 2023’ కిరీటాన్ని దక్కించుకుంది. ఎల్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో నిర్వహించిన 72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఆమె విజేతగా నిలిచింది.

నికరాగ్వాకు చెందిన అందాల భామ షెన్నిస్ పలాసియోస్ ‘ మిస్ యూనివర్స్ 2023’ కిరీటాన్ని దక్కించుకుంది. ఎల్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో నిర్వహించిన 72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఆమె విజేతగా నిలిచింది. దీంతో మిస్ యూనివర్స్ 2022 విజేత గాబ్రియెల్ చేతుల మీదుగా షెన్నిస్ కిరీటాన్ని ధరించింది. కాగా ఈ పోటీలో నికరాగ్వా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌లకు చెందిన భామ్మలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఇక భారత్ నుంచి పోటీ పడిన శ్వేతా శారదా సెమీస్‌లో టాప్-20కు అర్హత సాధించింది. కానీ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది.

కాగా మిస్ యూనివర్స్ 2023 ఎంపిక కోసం పోటీలో పాల్గొన్న అందగత్తెలు వివిధ దశల్లో పోటీపడ్డారు. వ్యక్తిగత ప్రకటనలు, ఇంటర్వ్యూలు, ఈవెనింగ్ గౌన్లు, ఈత దుస్తులలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ఫైనల్ పోటీకి జెన్నీ మే జెంకిన్స్, మరియా మెనౌనోస్, మాజీ మిస్ యూనివర్స్ ఒలివియా కల్పో హోస్టులుగా వ్యవహరించారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం కోసం దాదాపు 84 మంది పోటీపడ్డారు. దాదాపు 13000 మంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

Updated Date - 2023-11-19T10:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising