ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime News: ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదంటూ.. ప్రేయసిని చంపి ప్రియుడి బలవన్మరణం.. చివరగా రికార్డ్ చేసిన వీడియోలో..!

ABN, First Publish Date - 2023-05-20T16:43:49+05:30

నోయిడాలోని శివ నాడార్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ కుర్రాడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేయసి గురించి షాకింగ్ విషయం తెలుసుకుని ఆమెను కాల్చి చంపాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు ఓ వీడియోను రూపొందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోయిడాలోని (Noida) శివ నాడార్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ కుర్రాడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేయసి గురించి షాకింగ్ విషయం తెలుసుకుని ఆమెను కాల్చి చంపాడు (student kills girlfriend). అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు (student kills self). చనిపోవడానికి ముందు ఓ వీడియోను రూపొందించాడు. తాను ఎందుకు చనిపోతున్నాడో ఆ వీడియోలో పేర్కొన్నాడు. ప్రేయసి చేసిన మోసం (Cheating) గురించి వివరించాడు. ప్రేయసి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. ఆ కుర్రాడి పేరు అనుజ్ కుమార్, అతడి గాళ్‌ఫ్రెండ్ పేరు స్నేహ చౌరాసియా.

``నేను చాలా మంచి వ్యక్తిని. ఎప్పుడూ ఎవరినీ నొప్పించలేదు. నేను బాగానే చదివేవాడిని. అథ్లెటిక్స్‌లో జాతీయ స్థాయి క్రీడాకారుడిని. నేను ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది స్నేహ చౌరాసియాను కలిసే వరకు నా జీవితం బాగానే ఉండేది. ఆమె నా జీవితంలోకి వచ్చి మొత్తం మార్చేసింది. నన్ను ప్రేమలో పడేసింది. ఆమె నా లోకం అనుకున్నా. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించా. కానీ, ఆమె నిజాయితీగా లేదు. ఆమె నన్ను ప్రేమిస్తూనే యూనివర్సిటీ మెస్ వర్కర్ ఆశుతోష్ పాండేను రహస్యంగా కలిసేది. నేను రాత్రి పడుక్కున్న తర్వాత ప్రతిరోజూ అశుతోష్‌తో మాట్లాడేది.

Shocking News: గిఫ్ట్ బాక్సుల్లో వాడి పారేసిన కండోమ్స్.. 65 యువతులకు సేమ్ సీన్ రిపీట్.. అంతా ఒకే కాలేజీకి చెందిన వాళ్లే..

తర్వాత మొబైల్‌లో కాల్స్, ఛాటింగ్ డిలీట్ చేసేది. గత ఏడాది కాలంగా ఆమె ఇలాగే చేస్తోందని తెలిసి నేను షాకయ్యాను. నేను, అశుతోష్ మాత్రమే కాదు.. మరో ఇద్దరితో కూడా స్నేహ క్లోజ్‌గా ఉంటోందని తెలిసింది. విషయం తెలిసి ఆమెను బతిమాలాను. నిజాయితీగా ఉండమని కోరాను. అయినా ఆమె మారలేదు. అందుకే ఆమెను చంపేశాను. నేను చేసిన దాన్ని నేను సమర్థించుకోవడం లేదు. నన్ను క్షమించమని స్నేహ తల్లిదండ్రులను వేడుకుంటున్నాను. నిజానికి వారికి కూతురుగా ఉండే అర్హత స్నేహకు లేద`ని ఆ సూసైడ్ వీడియోలో అనుజ్ పేర్కొన్నాడు.

Updated Date - 2023-05-20T16:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising