Snake bite: పాము కాటేసినా పరీక్ష రాస్తానని పట్టుబట్టిన బాలిక.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..
ABN, First Publish Date - 2023-03-26T15:25:38+05:30
సాధారణంగా పాములంటే ఎంతటి వారికైనా భయమే. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. ఇక, పాము కాటు వేసిందంటే ముందు భయంతోనే ప్రాణాలు పోగొట్టుకుంటారు.
సాధారణంగా పాములంటే (Snake) ఎంతటి వారికైనా భయమే. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. ఇక, పాము కాటు (Snake Bite) వేసిందంటే ముందు భయంతోనే ప్రాణాలు పోగొట్టుకుంటారు. అలాంటిది ఒడిశాకు (Odisha) చెందిన ఓ బాలిక మాత్రం పాము కాటుకు గురైన తర్వాత కూడా ఏమాత్రం భయపడకుండా పరీక్షకు హాజరైంది. హాస్పిటల్‌కు తర్వాత వెళ్దాంలే అని పరీక్షా కేంద్రానికి వెళ్లింది. చివరకు పరీక్ష రాస్తూ కుప్పకూలిపోయింది.
ఒడిశాలోని ప్రస్తుతం ఇంటర్మీడియెట్ పరీక్షలు (Exams) జరుగుతున్నాయి. కేంఝర్ జిల్లా దధిబబపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని లిప్సా రాణి (17) ఇంటర్మీడియట్ చదువుతోంది. శనివారం ఫైనల్ పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. నడిచి వెళ్తుండగా దారిలో ఆమెను అకస్మాత్తుగా పాము కాటేసి వెళ్లిపోయింది. వెంటనే ఈ విషయాన్ని రాణి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో వెంటనే తండ్రి కూతురి దగ్గరకు చేరుకుని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే రాణి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. పరీక్ష రాయకపోతే ఏడాది కాలం వృథా అవుతుందని, పరీక్ష రాసిన తర్వాత వెళ్దామని పట్టుబట్టింది. (Girl attends exam after Bitten by snake)
Viral: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని చెప్పిన యువకుడు.. ఏకంగా పెళ్లే రద్దు చేసుకున్న యువతి.. అసలు కథేంటంటే..
కూతురి బలవంతం మీద తండ్రి ఆమెను తన బైక్ పై పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్ష రాస్తుండగా రాణి తీవ్ర అస్వస్థకు గురైంది. వెంటనే ఆ బాలిక తండ్రి, సిబ్బంది కలిసి ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రాణికి ఎటువంటి ప్రాణాపాయం లేదని, ఆమెను కాటేసిన పాము అంత విషపూరితం కాదని వైద్యులు తెలిపారు.
Shocking Fact: గాజు గ్లాసులోనే మద్యం ఎందుకు తాగుతారు? స్టీల్ గ్లాసులు వాడితే ప్రమాదకరమా?
Updated Date - 2023-03-26T15:41:39+05:30 IST