ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cooler: వాడకుండా పక్కన పడేసిన పాత కూలర్‌ను మళ్లీ బయటకు తీస్తున్నారా..? వాడే ముందు చేయాల్సిన పనులివీ..!

ABN, First Publish Date - 2023-03-30T13:38:18+05:30

కూలర్‌ (Cooler)ను క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఈ పద్ధతులు తప్పకుండా పాటించాలి. లేదంటే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

Cooler
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. మరోవైపు ఇంట్లో ఉండాలన్నా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి నెలలోనే భానుడు భగభగ మండిపోతున్నాడు. ఓ వైపు రెస్ట్‌లేకుండా ఫ్యాన్లు తిరుగుతున్నా.. చల్లదనం లేక చెమటలు పట్టేసి ఇబ్బందులకు గురవుతుంటారు. చాలా మంది ఏ చెట్టు నీడనో.. లేదంటే ఏసీలోనూ సేదతీరుతుంటారు. ఇంకొందరైతే మూలన పడేసిన కూలర్లను మళ్లీ బయటకు తీస్తుంటారు. స్థోమత ఉన్నవారైతే బయటకు తీసుకెళ్లి రిపేర్ చేయించుకుంటే... ఇంకొందరైతే సొంతంగానే శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా స్వయంగా కూలర్‌ (Cooler)ను క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఈ పద్ధతులు తప్పకుండా పాటించాలి. లేదంటే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

వర్షాకాలం.. శీతాకాలంలో పెద్దగా కూలర్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఇంట్లో ఏదో మూలన పెట్టేస్తారు. దీంతో బ్యాక్టీరియా, కీటకాలకు నివాసంగా మారుతుంది. ఇప్పుడు దాని అవసరం మళ్లీ రావడంతో బయటకు తీస్తుంటారు. కొంత మంది శుభ్రం చేయకుండానే ఉపయోగించేస్తుంటారు. ఇలా వాడితే వ్యాధులు విజృంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి పాత బడిన కూలర్లను ఉపయోగించే ముందు శుభ్రం చేసి వాడాలి. లేదంటే లేనిపోని రోగాలను కొనితెచ్చుకున్నవాళ్లం అవుతాం. అందుకోసం ఈ పద్ధతులను ఉపయోగించి కూలర్‌ను శుభ్రం చేయాలి. ఆ పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం?

ఇది కూడా చదవండి: Sperm Donor: అమ్మ బాబోయ్.. 550 మందికి తండ్రయ్యాడు.. ఇతడి గురించి నిజం తెలిసి ఓ మహిళ ఏం చేసిందంటే..

నిమ్మకాయ (lemon) లేదా వెనిగర్‌ (Vinegar)ని ఉపయోగించి పాత కూలర్లను క్లీన్ చేస్తే బ్యాక్టీరియా పోతుంది. ఇందుకోసం ముందుగా కూలర్ లోపలి బాగాన్ని నీళ్లతో కడిగి బ్రష్‌తో రుద్దిన తర్వాత నిమ్మకాయలు, వెనిగర్ వేసి వదిలేయాలి. ఓ గంట తర్వాత శుభ్రం చేయాలి.

ఇక కూలర్ బాడీపై దుమ్ము, ధూళి, తుప్పు పట్టినట్లయితే బ్రష్ లేదా నీటితో కడగాలి. ఆ తర్వాత బేకింగ్ సోడా లేదా డిటర్జెంట్ అప్లై చేయాలి. అరగంట తర్వాత బ్రష్ సహాయంతో శుభ్రం చేయాలి. దీంతో సులభంగా శుభ్రం అవుతుంది. తళతళ మెరుస్తుంది.

అలాగే కూలర్‌ ఫ్యాన్ రెక్కలపై పేరుకుపోయిన మడ్డిని, మురికిని శుభ్రం చేయడానికి తడి గుడ్డతో తుడవాలి. ఆపై నిమ్మరసం, వెనిగర్ మిక్స్ చేసి శుభ్రం చేయాలి.

ఇక ఫిల్టర్ కరిగిపోయినట్లయితే దానిని రీప్లేస్ చేయడం అవసరం. బాగుంటే మాత్రం దానిని ఎండలో బాగా ఆరబెట్టి దుమ్ము దులపండి. దీనికి వాక్యూమ్ క్లీనర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే కూలర్ శుభ్రమై చల్లటి గాలిని అందిస్తుంది. అంతేకాదు కొత్తదానిలా ప్రకాశిస్తుంది కూడా. అయితే ఆలస్యమెందుకు ఈ పద్ధతులను ఉపయోగించి పాత కూలర్లను క్లీన్ చేసి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడండి.

ఇది కూడా చదవండి: Facts About Peanuts: పల్లీ పకోడీలంటే ఇష్టమా..? వేయించుకుని ఉప్పు, కారం చల్లుకుని మరీ పల్లీలను తింటుంటారా..? ఈ నిజాలు తెలుసుకోండి..!

Updated Date - 2023-03-30T14:14:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising