ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Old Couple Drinking: ఆహా.. మందేస్తూ ఎంజాయ్ చేస్తున్న వృద్ధ జంట.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN, First Publish Date - 2023-03-11T19:32:33+05:30

స్వచ్ఛమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఎన్నో ఏళ్లు కలిసి జీవించిన భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ వృద్ధాప్యంలోనే ఉంటుందని అంటుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

స్వచ్ఛమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఎన్నో ఏళ్లు కలిసి జీవించిన భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ వృద్ధాప్యంలోనే ఉంటుందని అంటుంటారు. అయితే కొందరు మాత్రమే భాగస్వామితో కలిసి సంతోషాన్ని పంచుకోగలుగుతారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి తన సంతోషాన్ని పంచుకుంటున్నాడు. నిజానికి అలాంటి దృశ్యం మన దేశంలో అరుదనే చెప్పాలి. దీంతో ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది (Old Couple having a drink togeher).

ఒక వృద్ధ జంట ఓపెన్ టెర్రస్ రెస్టారెంట్‌లో మూలన ఉన్న ఓ టేబుల్ వద్ద ఎదురుగా కూర్చుని చీర్స్ చెప్పుకుంటూ ఆల్కహాల్ (Alchohol) సేవిస్తున్నారు. ఒక మహిళ, అందులోనూ వయసు మళ్లిన స్త్రీ భర్తతో కలిసి రెస్టారెంట్‌లో మద్యం సేవించడం చాలా అరుదనే చెప్పాలి. ముంబైలో ఈ దృశ్యం కొందరు యువకులకు చిక్కింది. దీంతో వారు ఆ వృద్ధుల అనుమతితోనే ఆ ఘటనను వీడియో తీశారు. అంతేకాదు వారి దాంపత్య జీవితం గురించి మాట్లాడి తెలుసుకున్నారు.

No Challan for Traffic Violations: రూల్స్‌ను బ్రేక్ చేసినా చలానా విధించమంటూ ట్రాఫిక్ పోలీసుల ప్రకటన.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏంటంటే..!

Kaifi Khalil•Kahani Suno 2.0 అనే ఇన్‌స్టాగ్రామ్ (Instagram Videos) హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ``భారతదేశంలో ఒక వృద్ధ జంట బయటి రెస్టారెంట్‌లలో మద్యం సేవించడం సాధారణం కాదు. నేను, నా స్నేహితులు ముంబైలోని ఒక రెస్టారెంట్‌లో అలాంటి జంటను కలుసుకున్నాము. వారిని చూసి ఆశ్చర్యపోయాము. అలాగే, వారి జీవిత అనుభవాల గురించి విన్నందుకు మేము చాలా సంతోషించాము`` అని కామెంట్ చేశారు. ఈ వైరల్ వీడియోపై (Viral Video) చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ``ఉత్తమ జంట`` అంటూ ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2023-03-11T19:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising