Fact Check: చంద్రయాన్-3 సక్సెస్ టైంలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో నిజమెంత..?
ABN, First Publish Date - 2023-08-26T16:11:57+05:30
చంద్రయాన్-3 సక్సెస్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అయిపోతున్నాయి. చంద్రుడిపై ల్యాండర్ దిగిన తర్వాత నెటిజన్లు.. ఓ ఫోటోను వైరల్ చేశారు. రోవర్ వీల్ ప్రింట్ అంటూ నెట్టింట చక్కర్లు కొట్టిన ఫోటో ఫేక్ అని తేలింది. ఇప్పుడు మరో వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. వ్యోమగామి నడుస్తున్నట్టుగా ఉన్న వీడియో బాగా వైరల్ అవుతోంది.
చంద్రయాన్-3 సక్సెస్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అయిపోతున్నాయి. చంద్రుడిపై ల్యాండర్ దిగిన తర్వాత నెటిజన్లు.. ఓ ఫోటోను వైరల్ చేశారు. రోవర్ వీల్ ప్రింట్ అంటూ నెట్టింట చక్కర్లు కొట్టిన ఫోటో ఫేక్ అని తేలింది. ఇప్పుడు మరో వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. వ్యోమగామి నడుస్తున్నట్టుగా ఉన్న వీడియో బాగా వైరల్ అవుతోంది. దేశంలో రోడ్ల దుస్థితిని వివరించేందుకు ఓ యువకుడు చేసిన ఓ పని అందర్నీ ఆకట్టుకుంది. రోడ్లు మొత్తం గుంతల మయంగా మారిపోవడంతో ప్రజల బాధలను ప్రభుత్వాలకు కళ్లకు కట్టినట్టు చూపించేందుకు బెంగళూరుకు చెందిన ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు.
ఆస్ట్రోనాట్ సూట్ వేసుకుని వేరే గ్రహంలో నడిచినట్టుగా నటిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. ఇతర గ్రహాలపై వ్యోమగాములు నడుస్తున్నట్టుగా గుంతలు పడ్డ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. ఆ వీడియోలో ఆ యువకుడిని చూస్తే.. నిజంగా వేరే గ్రహంపైన ఉన్నామా అనే భావన కలుగుతుంది. వాహనాలు ఆ రోడ్డుపై వెళ్లేంతవరకు అది భూమి అని తెలియదు.
రోడ్డుపై జాగ్రత్తగా నడుస్తూ.. అంతరిక్షంలోనే ఉన్నట్టుగా భ్రమ కల్పించాడు. వీడియో వైరల్ కావడంతో ఫ్యాక్ట్ చెక్ చేయగా.. ఆ వీడియో 2019 సంవత్సరంలో పోస్ట్ చేసినట్టు తేలింది. అయితే ఇప్పుడు వ్యోమగామి చంద్రుడిపైన దిగినట్టుగా వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పూర్తి వీడియో కాకుండా.. ఆ వీడియోను ట్రిమ్ చేసి చంద్రుడిపై పరిస్థితులు ఇలా ఉంటాయంటూ ఫేక్ పోస్టును వైరల్ చేస్తున్నారు. ఇక మరికొంత మంది ఎక్కడైతే రోడ్లు బాగాలేవో.. ఆ ప్రాంతం పేరు పెట్టి చంద్రగ్రహంలా మన రోడ్లు మారిపోయాయి అంటూ పోస్టులు చేస్తున్నారు. మరొకరు హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిని తెలియజేసేలా చాంద్రయాణగుట్టను చంద్రయాన్-3 గుట్ట అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని.. 2019లో వీడియో అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-08-26T16:13:55+05:30 IST