Shocking Video: అసలు ఇది ఎలా సాధ్యం.. డైరెక్ట్‌గా పాలిథిన్ బ్యాగులోనే వండుతున్న బామ్మ.. వీడియో చూస్తే..
ABN, First Publish Date - 2023-02-25T21:09:55+05:30
ప్రపంచమంతా ప్లాస్టిక్‌ను (Plastic) నిషేధించాలని గళం విప్పుతోంది.. పాలిథిన్ కవర్లలోని (Plastic Bag) ఆహారం చాలా ప్రమాదకరమని అందరూ అంటుంటారు.. అయితే ఓ బామ్మ ఏకంగా పాలిథిన్ కవర్నే కట్టెల పొయ్యిపై పెట్టేసి చేపల కూర వండుతోంది..
ప్రపంచమంతా ప్లాస్టిక్‌ను (Plastic) నిషేధించాలని గళం విప్పుతోంది.. పాలిథిన్ కవర్లలోని (Plastic Bag) ఆహారం చాలా ప్రమాదకరమని అందరూ అంటుంటారు.. అయితే ఓ బామ్మ ఏకంగా పాలిథిన్ కవర్నే కట్టెల పొయ్యిపై పెట్టేసి చేపల కూర వండుతోంది.. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి మంట తగిలితే ప్లాస్టిక్ పూర్తిగా కరిగిపోతుంది.. అలాంటిది అందులోనే వంట చేయడం ఎలా సాధ్యమైందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు (woman Cooks Fish curry in A Plastic Bag).
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వృద్ధురాలు కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఉంది. ఓ ప్లాస్టిక్ కవర్లో నీళ్లు నింపి దానిని మండుతున్న కట్టెలపై ఉంచింది. తర్వాత కవర్లోని నీటిలో చేపల పులుసుకు (Fish curry) కావలసిన పదార్ధాలన్నీ వేసింది. తర్వాత చేపను కూడా అందులో వేసింది. ఓ ఎండిన కొమ్మతో ఆ చేపల పులుసును కలిపింది. కట్టెల పోయ్యిపై ప్లాస్టిక్ కవర్లో వంట చేయడం చాలా మందిని షాక్‌కు గురి చేసింది. @TheFigen_ అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది.
భూమిపై నూకలు ఇంకా మిగిలి ఉన్నాయంటే ఇదేనేమో.. భార్యను పొడిచేశాడు.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.. తీరాచూస్తే..
మంట తగిలితే ప్లాస్టిక్ వస్తువులు, అందులోనూ కవర్లు వెంటనే కరిగిపోతాయి. అలాంటిది ఈ కవర్ అంత మంటను ఎలా తట్టుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ వీడియోను (Viral Video) ఇప్పటివరకు 5 లక్షల మంది చూశారు. అది గ్రాఫిక్స్ అంటూ చాలా మంది కొట్టి పారేస్తున్నారు. ఏదేమైనా ఆ మిస్టరీ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
Updated Date - 2023-02-25T21:09:56+05:30 IST